కుంటిసాకులు చెబుతున్న కేంద్రం

The center of luggage

The center of luggage

Date:09/10/2018
అమరావతి  ముచ్చట్లు:
ఏపీపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోంది. వెనుకబడిన జిల్లాల నిధులనూ ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేస్తోంది. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ ప్యాకేజ్ ఇవ్వలేదు.. ఆఖరికి.. కేంద్రం ఇస్తానన్న నిధులూ ఇవ్వడం లేదని మంత్రి సుజయ కృష్ణ రంగారావు విమర్శించారు. అకౌంట్లో నిధులు వేసి.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే ఆ నిధులను కేంద్రం వెనక్కు తీసుకుంది. యూసీలు ఇచ్చినా కుంటిసాకులు చూపుతూ ఇవ్వాల్సిన నిధులను పెండింగులో పెట్టారు.పక్కనున్న తెలంగాణకు ఇచ్చి.. లోటు బడ్జెట్టు ఉన్న ఏపీకి నిధులివ్వకపోవడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
ప్రజలంతా కేంద్రాన్ని అసహ్యించుకుంటున్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జగన్-పవన్ ఎందుకు మాట్లాడ్డం లేదు. విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తోన్నా.. కేంద్రం వెనుకడిన జిల్లాలకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. కేంద్రం గిరిజన యూనివర్శిటీకి అనుమతులివ్వాల్సి ఉంది.. ఈ విషయంలోనూ జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. అన్యాయం చేస్తోన్న కేంద్రాన్ని తప్పుపట్టకుండా.. జగన్-పవన్ ప్రజలను ఓట్లేలా అడుగుతారని అన్నారు.
Tags:The center of luggage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *