హై వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Date:20/02/2021

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఏపీకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (హైవే ప్రాజెక్టులు) ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కొర్లమ్-కంటకపల్లి సెక్షన్ 6 లైన్ డెవలప్‌మెంట్ పనులకు పచ్చ జెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ.772.7 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాయ్‌పూర్- విశాఖపట్నం ఎకనమిక్స్ కారిడార్‌ కింద ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతాయి.ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కంటకపల్లి- సబ్బవరం 6 లైన్ నిర్మణానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.824 కోట్లుగా ఉంటుంది. ఇంకా అనంతపురంలో ఎన్‌హెచ్ 42కు చెందిన 4 లైన్ల అర్బన్ రోడ్డు వెడల్పు పనులకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. దీనికి రూ.311 కోట్లు కేటాయించింది.మోదీ సర్కార్ అలాగే ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలి- జగదీశ్‌పూర్ 2/4 లైన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.720 కోట్లు. ఇవేకాకుండా మరో రెండ్ ప్రాజెక్టులకు కూడా నితిన్ గడ్కరీ ఓకే చెప్పారు. ఇవి కూడా యూపీలోనే ఉన్నాయి.

పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్‌.

Tags: The center of the high thousand is the green signal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *