టీడీపీ నేతలపై కేంద్రం కక్ష కట్టింది

The center of the TDP leaders was bolstered

The center of the TDP leaders was bolstered

Date:12/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతోన్న ఆదాయపుపన్ను శాఖ దాడులతో రాజకీయ, వ్యాపార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. గత శుక్రవారం విజయవాడ, గుంటూరు, విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు, తాజాగా టీడీపీ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు ఐటీ అధికారులు షాకిచ్చారు. కడప, హైదరాబాద్‌లలో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఎం రమేశ్ స్వగ్రామం కడప జిల్లా పోట్లదుర్తితోపాటు పాటు హైదరాబాద్‌లో ఆయనకు చెందిన నివాసం, సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 60 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఐటీ దాడులపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రమేశ్ స్పందించారు. టీడీపీ, ఆ పార్టీ నేతలపై కేంద్రం కక్షగట్టిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఐటీ సోదాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకే కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం రమేశ్ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు భయానకవాతావరణం సృష్టించి, బెదిరించాలని చూస్తున్నారని, కేంద్రం ఏం చేసినా తాము భయపడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు తాము ఆదాయపు పన్ను చెల్లింపులో ఎలాంటి జాప్యం చేయడంలేదని, తరుచూ చెల్లిస్తున్నామని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
అధికారులకు పూర్తిగా సహకరించాలని కుటుంబసభ్యులకు, అనుచరులకు చెప్పానని, తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తమ పార్టీని టార్గెట్‌గా చేసుకుని దాడులు చేయిస్తున్నారని, వీటిని ప్రజలంతా గమనిస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల వారికే నష్టమని రమేశ్ అన్నారు. వాళ్లు సోదాలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఊళ్లోలేని సమయం చూసుకుని తనిఖీలు చేయడమేంటని నిలదీశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులకు పురికొల్పుతోందని విమర్శించారు. విభజన హామీలపై పార్లమెంటులో బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం పార్లమెంటు ప్రజా పద్దుల సంఘంలో సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్‌ ఇటీవల జరిగిన సమావేశంలో… దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ నివాసాలు, ఆస్తులపై దాడులు జరగడం విశేషం.
Tags:The center of the TDP leaders was bolstered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *