తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలి: ఉపరాష్ట్రపతి 

-కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శితో సమీక్ష
Date:16/03/2018
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలని, వాటిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వాటిని పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని భారత ఉపరాష్ట్రపతి  ఎం. వెంకయ్యనాయుడు  అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం  నిన్న సాయంత్రం తన నివాసానికి పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ సహకారంతో తెలుగు భాష అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కూలంకషంగా చర్చించారు.
మైసూరులోని క్లాసికల్ లాంగ్వేజెస్ సెంటర్ లోని డైరెక్టర్ పదవి ఖాళీగా ఉందని, దాని నియామకానికి ఎదురౌతున్న ఇబ్బందులను తొలగించి వెంటనే ఆ పదవిని భర్తీ చెయ్యవలసిందిగా కార్యదర్శిని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఇలాంటి కేద్రాన్ని ఏర్పాటు చెయ్యవలసిందిగా కోరారు. తక్షణమే ఈ విషయంపై దృష్టిసారిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి  చెప్పారు.అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు దేశంలో ఇంకొన్ని విశ్వవిద్యాలయాలలో ఉన్నమాదిరిగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కూడా తెలుగు భాషా విభాగాన్ని ఏర్పాటు చెయ్యడానికి సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, ఢిల్లీ దేశ రాజధాని అయినందున, అనేక మంది తెలుగువారు ఇక్కడే నివాసముంటున్నందున తెలుగు భాషాపరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉందని, ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి ప్రతిపాదనలను సిద్ధం చెయ్యాలని ఉపరాష్ట్రపతి కోరారు. ఈ ప్రతిపాదనపై జె.ఎన్.యు వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి మరలా ఏ విషయమూ తెలియజేస్తానని సుబ్రహ్మణ్యం  ఉపరాష్ట్రపతి కి తెలిపారు.
మూడవది, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని ఎన్.సి.ఇ.ఆర్.టి (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్) కేంద్రం దక్షిణ భారతదేశానికంతటికీ కలిపి మైసూరులో ఉండగా, తాను మంత్రిగా ఉన్నప్పుడు చొరవ తీసుకుని తమిళనాడు, పుదుఛ్చేరి, అండమాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలకు గాను ఒక కేంద్రం ఏర్పాటుకు కృషిచేసినట్లుగా  వెంకయ్యనాయుడు  తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ సంస్థకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి  ప్రకాశ్ జవదేకర్ చేతులమీదుగా శంకుస్థాపన కూడా చెయ్యించినట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ సంస్థ నిర్మాణ పూరోగతిని కూడా కేంద్ర కార్యదర్శితో సమీక్షించారు. భూ సేకరణ విషయంలో కొంత ఆలస్యం జరుగుతోందని, రాష్ట్రప్రభుత్వం భూసేకరణను పూర్తి చేస్తే నిర్మాణం ప్రారంభిస్తామని కేంద్ర కార్యదర్శి చెప్పగా, వెంటనే తన నివాసం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  దినేష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి, ఈ విషయం ఎక్కడ పెండింగ్ లో ఉందో కనుక్కుని త్వరిత గతిన కేంద్ర ప్రభుత్వానికి నివేదించమని సూచించారు. రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని రాష్ట్ర విద్యాశాఖ చెల్లిచాలా లేక రెవెన్యూశాఖ చెల్లించాలా అనే విషయం పెండింగ్ లో ఉందని తెలుసుకుని, ఆ విషయంపై రెండు శాఖలను సమన్వయ పరచి త్వరిత గతిన భూమిని కేంద్ర మానవ వనరుల శాఖకు బదిలీ చేస్తే మంచిదని అధికారులకు సూచించారు, వారంలో రోజల లోపలే ఈ విషయాన్ని పరిష్కరించి పనులు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  కోరారు.నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రాష్ట్రప్రభుత్వాధీనంలోనికి కాబట్టి దాని మౌలిక వసతులను రాష్ట్రప్రభుత్వమే కల్పించాల్సి ఉంది. అయిప్పటికీ క్రొత్తగా ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయం కాబట్టి కేంద్రం నుండి ఏమైనా సహాయం అందించే అవకాశం ఉందా అని ఉపరాష్ట్రపతి మానవ వనరుల శాఖ కార్యదర్శిని అడగ్గా, ఆయన సంబంధిత ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర పరిశీలిస్తుందని ఉపరాష్ట్రపతికి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో  గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు,  కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాట్లలో ఏదురవుతున్న సమస్యలను పరిష్కరించి తక్షణమే ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యేలా చూడమని ఉపరాష్ట్రపతి కేంద్ర మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి  సుబ్రహ్మణ్యం సూచించారు. దీనిపై  సుబ్రహ్మణ్యం వివరణనిస్తూ, ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదం అలాగే ఇ.ఎఫ్.సి ఆమోదాలు లభించాయని, తర్వాత కేబినెట్ ఆమోదం కోసం నోట్ తయారు చెయ్యబడినదని, దానిని వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాల కోసం పంపించినట్లు తెలిపారు.
Tags: The Center should come forward for development of Telugu Language: Vice President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *