ఒరిస్సా రైలు ప్రమాద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.

ఒరిస్సా ముచ్చట్లు;

రైలు ప్రమాద క్షతగాతుర్లకు మెరుగైన వైద్యం అందించాలి.
రైలు ప్రమాద మృతులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
అనకాపల్లి
. అనకాపల్లి పట్టణంలోని స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ (నెహ్రు చౌక్ జంక్షన్) వద్ద ఇటివల ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు.రైలు ప్రమాద క్షతగాతుర్లకు మెరుగైన వైద్యం అందించాలి కోరారు. మృతుల కుటుంబాలలో ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎస్కే రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారపూ త్రినాథ్, బొద్దపూ ప్రసాద్, సబ్బవరపు గణేష్,కొణతాల రత్న కుమారి, ఆళ్ళ రామచంద్రా రావు, ఆకుల నానాజీ, సూరి సతీశ్ కుమార్, దనాల విష్ణు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags::The central and state governments should support the Orissa train accident victims.

Post Midle