ప్రైవేటు దవాఖానల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలను నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.780
రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ టీకా రేటు రూ.1,145,
భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకా ధర రూ.1,410
ఆసుపత్రులకు చెల్లించే సర్వీస్‌ చార్జి రూ.150 ఇందులో భాగమే

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రైవేటు దవాఖానల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిర్దేశించిన రేట్ల ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.780, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ టీకా రేటు రూ.1,145, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకా ధర రూ.1,410గా నిర్ణయించింది. అన్ని పన్నులతో పాటు ఆసుపత్రులకు చెల్లించే సర్వీస్‌ చార్జి రూ.150 ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు దవాఖానలు సర్వీస్‌ చార్జి రూ.150 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.ఈ మేరకు ఆయా దవాఖానాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రధాని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్రమే కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వనుండగా.. ఉచితంగా వద్దనుకునే వారికి టీకాలు వేసేందుకు 25శాతం ప్రైవేటు ఆసుత్రులకు ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The central government sets the prices of corona vaccines in private hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *