The central government should abolish the NRC and the CCA

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ , సీసీఏలను రద్దు పరచాలి

– స్పందిచేదాక పోరాటం ఆగదు
– ఆల్‌ఇండియా ముస్లిం పర్శనల్‌ లాబోర్డ్ మెంబర్‌ మౌలనాముఫ్తీ

Date:19/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సీ , సీసీఏ , ఎన్‌ఆర్‌పీలను తక్షణమే రద్దు పరచాలని లేకపోతే పోరాటం తీవ్రం చేస్తామని ఆల్‌ఇండియా ముస్లిం పర్శనల్‌ లాబోర్డ్ మెంబర్‌, జమియతుల్లా ఉలమా అధ్యక్షుడు మౌలనాముఫ్తీ సయ్యద్‌ మసూమ్‌సాఖిబ్‌సాహెబ్‌ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం పుంగనూరు ఎన్‌ఎస్‌.పేట మైదానంలో వేలాది మంది ముస్లింలచే బహిరంగ సభ నిర్వహించారు. సభ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రాంగణంలో ఎన్‌ఆర్‌సీ, సీసీఏ , ఎన్‌ఆర్‌పీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లెక్సిలు ఏర్పాటు చేశారు. ముస్లింలు ర్యాలీగా మైదానానికి తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిధులుగా జమాతే ఇస్లామి హింద్‌ ఇస్లామిక్‌ రాష్ట్ర కార్యదర్శి మౌలనాఅబ్ధుల్‌ సుబహాన్‌సాహెబ్‌, కర్నాటక వక్ఫ్బోర్డ్ మెంబరు మహమ్మద్‌జూల్ఫీకర్‌అలీ, మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ యమలా సుదర్శన్‌ , సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, జిల్లా రైతు సంఘ నాయకుడు జనార్ధన్‌ హాజరైయ్యారు. సభలో మౌలనాముఫ్తీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మతంపేరుతో వేదింపులు మంచిదికాదన్నారు. 50 సంవత్సరాలుగా లేని ఎన్‌ఆర్‌సీ , సీసీఏ సవరణలు ఇప్పుడు అవసరమా అంటు నిలధీశారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలను మంటగలిపేందుకు ప్రభుత్వం ఇలాంటి సవరణ చట్టాలు చేస్తోందని మండిపడ్డారు. సవరణ చట్టాలను రద్దు చేసేదాక ముస్లింల పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. తొలుత పౌరసత్వాన్ని ప్రధానమంత్రి నుంచి రుజువుచేసుకోవాలని తరువాతనే ప్రజలందరు రుజువు చేసుకుంటారని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరీని మార్చుకుని , రాజ్యాంగం పరిధిలో పాలన కొనసాగించాలని హితవుపలికారు. లేకపోతే ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు కరీముల్లాఖాన్‌షా , కార్యదర్శి ఎండి.రహంతుల్లా, సున్నీఅంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ భూమి దురాక్రమణ

Tags: The central government should abolish the NRC and the CCA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *