The Chennai market ...

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న చెన్నై మార్కెట్…!

Date:10/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మొన్నటి వరకు శ్రీకాళహస్తిలో నమోదైన కరోనా కేసులతో వణికిపోయిన చిత్తూరు జిల్లా వాసులకు.. తాజాగా చెన్నై కోయంబేడు మార్కెట్ రూపంలో మరో పెద్దసమస్య వచ్చిపడింది. మొన్నటి వరకు జిల్లాలో 96 కేసులు ఉంటే.. వాటిలో 90శాతం మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో వారంలో జిల్లాలో కేసులు రాకపోవచ్చని భావిస్తుండగా.. కోయంబేడు మార్కెట్ రూపంలో ఉపద్రవం వచ్చిపడింది. తాజాగా నమోదైన 11 కేసుల్లో.. అన్నీ కోయంబేడుకు సంబంధించినవే . దీంతో చిత్తూరు జిల్లా అధికారులు చెన్నైకి వెళ్ళిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. తొలి విడతలో విదేశాలనుంచి వచ్చిన వారితో ముప్పు వెంటాడింది. సద్దుమణిగింది అనుకునే సమయంలో మర్కజ్‌ యాత్రీకుల రూపంలో.. శ్రీకాళహస్తిని అతలాకుతలం చేసింది. అయితే అంతా కుదురుకుని ఊపిరి పీల్చుకుంటున్న దశలో ఇప్పుడు కోయంబేడుతో రాకపోకలు సాగించిన వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి మొదలైంది. గత 24 గంటల్లోనే కోయంబేడు లింకుతో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వి.కోట మండలానికి చెందిన ఐదుగురు, సత్యవేడు మండలానికి చెందిన ఇద్దరు, వరదయ్యపాలెం మండలానికి చెందిన ఒక్కరు.. మదనపల్లెకు చెందిన మరొకరు.. వైరస్‌ బారిన పడ్డారు.

రామసముద్రం మండలాన్ని తాకిన కరోనా

Tags: The Chennai market …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *