శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల ముచ్చట్లు:
ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జెఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.

తిరుచానూరులో….
అదేవిధంగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు టీటీడీ జెఈవో వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమాల్లో డిఎల్‌వో వీర్రాజు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Tags: The Chief Justice of the High Court who visited Mr
