Natyam ad

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

తిరుమల ముచ్చట్లు:

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం విఐపి బ్రేక్ లో స్వామివారిని దర్శించుకున్నారు.టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధర్మారెడ్డి, జెఈవో  వీరబ్రహ్మం కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.

Post Midle

తిరుచానూరులో….

తిరుమల నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు టిటిడి జెఈవో  వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం పాల్గొన్నారు.

 

Tags: The Chief Justice of the High Court who visited Mr

Post Midle