Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి ముచ్చట్లు:

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ యుయు.లలిత్‌కు జేఈవో   వీరబ్రహ్మం స్వాగతం పలికారు . ఆగమ సలహా దారు   శ్రీనివాసాచార్యులు ,అర్చకులు శ్రీ బాబు స్వామి తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్‌ దంపతులకు వేద‌ పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు . సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె మిశ్రా కూడా అమ్మవారి ని దర్శించుకున్నారు.డిప్యూటీ ఈవో   లోకనాథం ,ఎ ఈవో  ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Post Midle

Tags: The Chief Justice of the Supreme Court visited Sri Padmavati Ammavari

Post Midle