బూతు పురాణాల ముఖ్యమంత్రి 

Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎం చేశారో చెప్పకుండా, కేవలం కాంగ్రెస్ నాయకుల పైన దుర్మార్గంగా మాటల దాడి చేస్తున్నాడు. మనసుకు రోగంతో టీఆరెస్ అధోగతి తప్పదు అని కాంగ్రెస్ పైన ఇష్ట రీతిగా దాడి చేస్తున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
సోమవారం అయన మీడియతో మాట్లాడారు. దేశంలో కేసీఆర్ లాగా బూతు పురాణం మాట్లాడుతూ, ఒక భూతు పురాణం ముఖ్యమంత్రిగా మారాడు. బతికి ఉన్న నేతపను కాకుండా భారత రత్న అయిన నెహ్రు పైన కూడా మాట్లాడున్నాడని అయన విమర్శించారు. తెలంగాణను బలవంతంగా  ఆంధ్రలో కలిపారఅని మరోసారి తెలంగాణ సెంటిమెంటు ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. అప్పటి పరిస్థితులను బట్టి ఆంధ్ర,తెలంగాణను కలిపాము ఒకవేళ రెండు రాష్ట్రాల ప్రజలకు పొసగక పోతే విడిపోవచ్చు అని నెహ్రు రఅన్నారని అయన వివరించారు.
పరిపాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చక,ప్రజలకు సమాధానం చెప్పలేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు కేసీఆర్. ప్రజలకు మభ్యపెట్టి ఎన్నికలలో ఒబెది పొందలనుకుంటున్నాడు. అప్పుడు ఒక మాట,ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్. అధికారం, డబ్బు మదం తో ఎలాగైనా ఎన్నికలో గెలుపొందొచ్చు అని ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. అందుకే బూతు పురాణం అందుకున్నాడు. కాంగ్రెస్ నాయకులను తిడుతున్న కేసీఆర్ ఎందుకు ఆరోజుల్లో కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు ను రాష్ట్ర సంపదను ఎలా పెంచాలో తెలిసిన వ్యక్తి అన్నాడు,ఇప్పుడు తూ చంద్రబాబు అంటున్నాడని అన్నారు.
కేసీఆర్ కు నోటీ దూల ఉంటే మీ కుటుంబ సభ్యులను,లేదా మీ పార్టీ నాయకులను పిలిచి తిట్టు ఆంటీ కానీ మా పార్టీ నాయకులను తిడితే ఊరుకొమని అయన హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి ని ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ 108,104,విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చినందుకా,రింగ్ రోడ్డు తెచ్చినందుకా ,అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకా,  ట్రిపుల్ ఐటీ, ఆరోగ్యశ్రీ, లక్షల ఎకరాలకు నీళ్లు, అవహిత కరంట్ ఇచ్చినందుకా అని ప్రశ్నించారు.
60వేల కోట్ల బడ్జెట్ ఉన్మా రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు రాజా శేఖర్ రెడ్డి,మరి ఈ రోజు 2లక్షల రాష్ట్ర బడ్జెట్ ఉంటే నువ్వు ఏమి అమలు చేస్తున్నావు. తెలంగాణ వచ్చింది ప్రకటనలు చేయడానికి కాదు ఉద్యోగాలు ,నియామకాలు, నీళ్లు,సరైన పాలన కోసం కానీ ఈ మోసాలకు కాదని అన్నారు.
Tags: The Chief Minister of Boodoo Legends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *