3 వ విడత వై.ఎస్.ఆర్ చేయూత పథకాన్ని కుప్పం నుండి ప్రారంభించనున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి

-ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది

-జిల్లాలో 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది

-జిల్లా కలెక్టర్

 

చిత్తూరు ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన 3వ విడత వై.ఎస్.ఆర్ చేయూత పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  కుప్పం నుండి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 సం.ల వయసు మధ్య గల అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750 లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమానికి   రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  కె.నారాయణస్వామి,  జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి    ఉష శ్రీ చరణ్,   రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక మరియు భూగర్భ గనుల శాఖామాత్యులు   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,   రాష్ట్ర సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె. రోజా, గౌ. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారని తెలిపారు.

 

మహిళల సమగ్ర అభివృద్ధి ఎజండా మరియు ఆర్ధిక సాధికారతలో భాగంగా, ప్రభుత్వం నవరత్నాలను ప్రవేశపెట్టిందని, అందులో భాగంగా మహిళా లబ్దిదారులకు కుటుంబ స్థాయిలో మెరుగైన జీవనోపాధులను అందిపుచ్చుకునే విధంగా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా వై.ఎస్.ఆర్ చేయూత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళా లబ్దిదారులు రూ.4,949.44 కోట్లు లబ్ది చేకూరనుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది చేకూరనుందని తెలిపారు.

 

లబ్దిదారుల వివరాలు నియోజకవర్గాల వారీగా . . చిత్తూరు నియోజకవర్గానికి చెందిన 12,418 మంది మహిళలకు రూ.23.28 కోట్లు, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన 13,021 మంది మహిళలకు రూ.24.41 కోట్లు, కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,011 మంది మహిళలకు రూ.28.14 కోట్లు, నగరి నియోజకవర్గానికి చెందిన 10,477 మంది మహిళలకు రూ.19.64 కోట్లు, పలమనేరు నియోజకవర్గానికి చెందిన 19,707 మంది మహిళలకు రూ.36.95 కోట్లు, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 17,680 మంది మహిళలకు రూ.33.15 కోట్లు, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన 14,270 మంది మహిళలకు రూ.26.75 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నదని తెలిపారు.
ఈ పథకం ద్వారా మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు చెందిన 83,156 మంది లబ్దిదారులకు రూ.155.91 కోట్లు, రెండవ విడతలో 89,460 మందికి రూ.167.73 కోట్లు లబ్ది చేకూరడం జరిగిందని తెలిపారు.

 

Tags:The Chief Minister of the state will launch the 3rd phase of YSR Handu Scheme from Kuppam

Leave A Reply

Your email address will not be published.