The chief minister's ambition is not to let the poor get drunk.

పేదలు మద్యపానం తో చితికి పోకూడదనేదే ముఖ్యమంత్రి ఆశయం.

– మద్యం ధరల పెంపు పేదలు అలవాటు పడకూడనే ఉద్దేశ్యం.

– దశాలవారి మద్యపాన నిషేధం చేస్తున్నాం.

– వ్యాసనాల వారి చికిత్స కోసం నేడు డి. ఆడిక్షన్ సెంటర్ లు రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రారంభం

– డిప్యూటీ సి.ఎం నారాయణ స్వామి

Date:29/05/2020

తిరుపతి ముచ్చట్లు :

నిరతంరం పేదల కోసం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పేదల సంక్షేమమే ద్యేయంగా దశల వారి మద్యపాన నిషేధం, ధరల పెంపుతో వ్యసనానికి దూరం కావాలని, వ్యసనం వున్నవారి వ్యసనం పోగొట్టడానికి నేడు డి.ఆడిక్షన్ సెంటర్ ప్రారంభించడం శుభపరిణామం అని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య శాఖల మంత్రి నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రుయా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డి. ఆడిక్షన్ సెంటర్ ప్రారంభించి అక్కడే ఏర్పాటు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్జ్ర వ్యాప్తంగా తాడేపల్లి నుండి 15 డి.ఆడిక్షన్ సెంటర్ లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.డిప్యూటీ సి.ఎం.మాట్లాడుతూ వ్యసనానికి బానిసలుగా మారిన పేదవారికి కొత్త జీవితం ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లు ముఖ్యమంత్రి ప్రారభించారని అన్నారు. నేడు ఇక్కడ ప్రారంభమయింది అన్నారు. వైద్యులు, సిస్టర్లు అంటే ముఖ్యమంత్రి కి ఆభిమానమని ప్రజలకు మీరే దేవుళ్లు అని అన్నారు. మద్యపానం నిషేదానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. డి.ఆడిక్షన్ సెంటర్ రుయాలో అందుబాటులోకి రావడం అదృష్టం అని అన్నారు. ఇప్పుడే డాక్టర్లు, సిబ్బందిని నియమించడం అభినందనీయం అన్నారు.
తమ భర్తలు వ్యసన పరులైతే ఇక్కడ కు తీసుకుని వచ్చి తమ కుటుంబాలను బాగుచేసు కోవాలని అన్నారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందలనే ఆశయం కోసం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేపడుతున్నారని తెలిపారు.సైక్రటిస్ట్ డిపార్ట్మెంట్ డా. నాగేశ్వరరావు డి. ఆడిక్షన్ సెంటర్ పనితీరు వివరించారు.సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం,జెసి(అభివృద్ధి) వీరబ్రహ్మం, రుయా ఆసుపత్రి సూపర్నెంట్ డా.భారతి, ఆర్ ఎం.ఓలు ఇ.బి.దేవి, సరస్వతి, ఎస్.వి.మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయభాస్కర్, మెడికల్ అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నారు.

బాలకృష్ణపై మండిపడ్డ ఇక్బాల్

Tags: The chief minister’s ambition is not to let the poor get drunk.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *