Natyam ad

ఎంపీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని పెద్దకురప్పల్లె పంచాయతీ దిగువ మెరుంపల్లికి చెందిన శ్రీరాములు కుమార్తె శ్రీకన్యకు ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి సహయనిది చెక్కు ను అందజేశారు. శ్రీ కన్యకు వెన్నుపూస చికిత్స కోసం రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిదున్ రెడ్డి ని ఆర్థికంగా సాయం కోరారు. ఈ మేరకు పీలేరు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ సియం సహాయనిధి కింద శ్రీరాములు కుమార్తె శ్రీకన్యకు రూ. 1.50 లక్షల చెక్కును రామసముద్రం మండలం నాయకులు సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకన్య తండ్రి శ్రీరాములు మాట్లాడుతూ తన కుమార్తె చికిత్స కోసం ఎంపి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా ల చొరవతో ఆర్థిక సాయం అందించేందుకు సహాయ పడిన రామసముద్రం మండలనాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భాస్కర్ గౌడు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, వైస్ ఎంపిపి రమణారెడ్డి, సర్పంచ్ రెడ్డెప్పనాయుడు, సిహెచ్ ప్రకాష్, గెవన్న, నందా, రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: The Chief Minister’s relief fund check will be handed over by the MP

Post Midle

Leave A Reply

Your email address will not be published.