బాలల హక్కుల పరిరక్షణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీది కీలక బాధ్యత

-రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యరాలు అనుమండ్ల శోభారాణి
కరీంనగర్  ముచ్చట్లు:
 
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన బాల రక్ష భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యరాలు అనుమండ్ల శోభారాణి హాజరు అయిచైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి , సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, రాధ, అర్చన, విజయ్ లని శాలువాలతో ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల రక్షణ మరియు సంరక్షణ విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఇక ముందు కూడా అలానే పోషిశించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ  అధికారి  పద్మావతి, చైల్డ్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినెటర్ సంపత్, ఇంచార్జ్ డీసీపీఓ శాంత, జిల్లా సక్షేమ ఆఫీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags; The Child Welfare Committee has a key responsibility in protecting the rights of the child