జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనా అధ్యక్షుడు గైర్హాజరర్ ?జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనా అధ్యక్షుడు గైర్హాజరర్ ?
న్యూ డిల్లీ ముచ్చట్లు:
సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాల అధ్యక్షులు హాజరుకాబోతున్నారు. అయితే ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు గైర్హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ఆయనకు బదులు ఆ దేశ ప్రధాని లి కియాంగ్ వస్తారని పేర్కొన్నాయి. అయితే, జిన్‌పింగ్ గైర్హాజరుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.

ఆయన (జిన్‌పింగ్) జీ20 సమ్మిట్‌కు హాజరవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. విలేకరులతో సమావేశం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ ఈ విధంగా స్పందించారు.భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్పింగ్ హాజరుకారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటీవలే వెల్లడించారు. అయితే పుతిన్ ఈ సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tags: The Chinese President was absent from the G-20 Heads of State Summit
