ప్రాథమిక విద్యను విచ్ఛిన్నం చేసే సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలి ఎస్ ఎఫ్ ఐ.

ఆదోని ముచ్చట్లు:
కరోనా విజృంభణ సమయంలో విద్యారంగం లో మార్పులు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 172 సర్క్యులర్ నీ వెంటనే రద్దు చేసి విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేదావుల సలహాలు, సూచనలు తీసుకొని కరోనా తగ్గిన తరువాత మార్పులు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయక్  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరోనా వలన విద్యా సంవత్సరం పూర్తి అయినా పరీక్షలు ఇంకా నిర్వహించలేదు. నిర్వహిస్తారో లేదో తెలియక విద్యార్థులు ఉపాధ్యాయులు గందరగోళంలో ఉన్నారు. ఏ విధానంలో పరీక్షలు పెట్టాలో తెలియక విద్యా శాఖ కూడా గందరగోళంలో ఉందని నిన్ననే విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఇంత గందరగోళంలో పాఠశాల విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు తెచ్చి మరింత గందరగోళానికి విద్యార్థులను నెట్టివేయడం ఎంత వరకూ సరైనదన్నారు.
కాషాయ,కార్పొరేట్ అజెండాతో ఉన్న జాతీయ విద్యా విధానం పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతూ నూతన విద్యా విధానం అమలకు పరుగులు పెట్టడం సిగ్గుచేటు. కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రం లో 10+2 విద్యావిధానం స్థానం లో 5+3+3+4 విధానం అమలు కానుంది.అంటే అంగన్వాడీ కేంద్రాల్లో 1,2 తరగతులను కలిపి విద్యాసంస్థ గా మార్చడం వలన పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించే లక్ష్యం పక్కకి పోతుంది. వీటిలో ఒక ఎస్ జి టి మాత్రమే ఉంచి మిగిలిన ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకి బదిలీ చేస్తారు.దీనివలన మూడు తరగతులకు ఓకే టీచర్ ఉండడం వలన టీచర్ కి పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే డ్రాప్ ఔట్స్ పెరుగుతాయి. ఉపాధ్యాయుల సంఖ్య కుదించబడుతుంది. దీనివలన నిరుద్యోగం పెరుగుతుంది. రాష్ట్రం లో ఉన్న 47 వేల అంగన్వాడీ కేంద్రాలు, వాటిలో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
కిలోమీటర్ కి ఒక ప్రాథమిక స్కూల్ ఉండాలన్న కొఠారి కమిషన్ సిఫార్సులను పక్కకి నెట్టి 3 నుండి 5 తరగుతలను  3 కిలో మీటర్ల కి ఒక ప్రాథమికొన్నత స్కూల్ మాత్రమే ఉంచడం వలన రాష్ట్రంలో 24 వేల పాఠశాలలు  మూతపడనున్నాయి.అలాగే 3  కిలోమీటర్ల దూరం వెళ్ళలేక విద్యార్థులు చాలా నష్టపోతారు.గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా డ్రాప్ ఔట్స్ పెరుగుతారు.
పక్క రాష్ట్రం తమిళనాడు తెలుగు కి ప్రాధాన్యత ఇచ్చింది.కానీ ఏ పి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తుంది.బి ఎడ్ వంటి కోర్సులు నాలుగేళ్లకు పెంచడం వలన విద్యార్థుల పై అధిక ఫీజుల భారం పడుతుంది.
ఎది ఏమైన ఇన్ని మార్పులు చేయడానికి సిద్ధపడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ మాత్రం పెంచలేదు. కనీసం పాఠశాలల మౌలిక వసతుల కోసం గానీ, టీచర్ల సంఖ్యను పెంచడం కోసం గానీ ఎటువంటి ప్రస్తావన చేయలేదు.బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం వృధా. ముందు విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ లో 10% రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించి అప్పుడు మార్పులు కోసం మాట్లాడడం మంచిది. కావున ప్రభుత్వ విద్యారంగాన్ని తూట్లు పొడిచే 172 జీఓ ను ఉపసంహరించుకుని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:The circular that breaks primary education should be withdrawn
SFI.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *