pgr

పౌరసత్వ సవరణ చట్టం మతాన్ని అణచివేసేందుకే

– 10వ రోజు కొనసాగిన దీక్షలు

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం మతాన్ని అణచివేసేందుకు చేస్తున్న కుట్రల్లో భాగమని ముస్లిం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పదో రోజు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. పట్టణంలోని రామనగర్‌కాలనీకి చెందిన హాబియా మసీదు ముతవల్లి మున్వర్‌సాహెబ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని, ఎన్‌ఆర్‌సీ,సీఐఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తున్నామని , ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్వర్‌సాహెబ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశంలో ప్రభుత్వం మతాల మధ్య చిచ్చురేపడం బాధకరమన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను కాపాడాలని , రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగించాలని డిమాండ్‌ చేశారు.

స్పందనలో సమస్యలు పరిష్కారం

Tags: The Citizenship Amendment Act is for the suppression of religion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *