Telangana Nam Ke Vast .. Tests

లాక్ డౌన్ లోనే ఆ నగరం

Date:09/04/220

ముంబై ముచ్చట్లు:

దేశంలో కరోనా వైరస్ కేసులు పెద్ద సంఖ్యలో నిర్ధారణ అయ్యే ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లగా పరిగణించి, మహమ్మారి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతున్నారు. ఇలాంటి జోన్‌లోనే ఉన్న మహారాష్ట్రలోని ఓ చిన్న పట్టణం ప్రస్తుతం వైరస్‌ను సమర్ధంగా కట్టిడిచేసే దిశగా సాగుతోంది. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న ఇస్లామ్‌పూర్ పట్టణంలో దాదాపు 70 వేల మంది జనాభా ఉంటారు. మార్చి 23న ఈ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఈ 17 రోజుల్లో ఈ పట్టణంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మొత్తం 26కు చేరుకుంది. వీరంతా తొలిసారి వైరస్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారే. సామూహిక వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మొత్తం 26 మందిలో తొమ్మిది మంది బుధవారం కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

 

 

 

పట్టణంలో నలుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వెంటనే జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులతో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడానికి జిల్లా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కోవిడ్-19 బాధితుల ఇంటికి కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న 53 మంది, తక్కువ ఉన్న 436 మందిని గుర్తించి.. వారిని ఐసోలేషన్‌కు తరలించారు.. అలాగే లక్షణాలు లేనివారిని స్వీయ నిర్బంధంలోనే ఉంచామని సంగ్లీ కలెక్టర్ అభిజీత్ ఛౌదురీ తెలిపారు.కంటెయిన్‌మెంట్ జోన్‌‌లో 1,608 కుటుంబాలకు చెందిన 7,600 మంది.. దీనికి సమీపంలోని కిలోమీటర్ పరిధిలో బఫర్ జోన్‌, మరో కిలోమీటరు పరిధిలోని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటుచేశామన్నారు. అలాగే, ఇస్లామ్‌పూర్‌లో మార్కెట్ ప్రాంతంలో రాత్రికి రాత్రే బారికేడ్లు ఏర్పాటుచేశారు.

 

 

 

కరోనా వైరస్ నిర్ధారణ అయిన కుటుంబం నివసించే వీధిలో ఎప్పుడు సందడిగా ఉంటుందని, ఎక్కువ మంది, మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలే ఇక్కడ నివశిస్తున్నాయని సౌరభ్ కుబేరే అనే ఓ విద్యార్ధి తెలిపాడు. నలుగురికి కోవిడ్-19 ఉన్నట్టు గుర్తించిన వెంటనే ఆ ప్రాంత మొత్తం బారికేడ్లతో దిగ్బంధించి, రసాయనాలు, బ్లీచింగ్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను అదే రోజు రాత్రి నిర్వహించారన్నాడు. తొలి రెండు రోజులు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నామని, తర్వాత అధికారులు ప్రణాళిక బద్దంగా వ్యవహరించి పాలు, నిత్యావసరాలు, కూరగాయలు సరఫరా చేశారని తెలిపాడు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.కంటెయిన్‌మెంట్ జోన్ నుంచి బయటకు వెళ్లే వాహనాలకు తప్పనిసరిగా శుభ్రం చేయడం.. బఫర్ జోన్‌లో కుటుంబానికి ఒక్కరినే నిత్యవసరాలు కొనుగోలుకు అనుమతించారు.

 

 

 

 

దీనిపై స్థానికుల్లో అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో జిల్లా వైద్య అధికారులు తమ టాస్క్ ప్రారంభించారు. బాధితులతో కాంటాక్ట్ అయినవారని, అనుమానితులను గుర్తించారు. మొత్తం 31 వైద్య బృందాలు ఏక కాలంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఆరోగ్య కార్యకర్తలు సైతం ఇంటింటికి వెళ్లి అందరి వివరాలను సేకరించారు. ఆరోగ్య, వయసు తదితర వివరాలను తెలుసుకున్నారు. చివరిగా పరిస్థితులు అదుపుతప్పకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు తమకు ఓ పాఠంగా ఉపకరిస్తాయని సాంగ్లీ ఎస్పీ వ్యాఖ్యానించారు. ఊహించని ఈ విపత్తును ఎదుర్కోడానికి చేపట్టిన చర్యలు అపూర్వమైనవి. సమర్ధవంతమైన నిర్వహణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ ప్రాంతం ఇప్పటికీ కంటెయిన్‌మెంట్ జోన్‌లో ఉంది.. స్థానికులు కూడా దీనికి సహకరిస్తున్నారు.

పుంగనూరులో చురుగ్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు

Tags: The city itself is locked down

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *