Natyam ad

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి- విద్యుత్‌శాఖమంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లె పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మదనపల్లెకు వచ్చిన వారు ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డితో కలిసి పుంగనూరు నియోజకవర్గ నాయకులతో సీఎం సభ విజయవంతంపై చర్చించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా జరుగుతున్న సీఎం పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, పీకేఎం-ఉడాచైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కరరెడ్డి, బైరెడ్డిపల్లె ఎంపీపీ ఎం.రెడ్డెప్ప, బోయకొండ ఆలయచైర్మన్‌ మిద్దింటిశంకర, చౌడేపల్లె రెడ్డిప్రకాష్‌, గాజులరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; The CM’s visit should be successful – Power Minister Peddireddy Ramachandra Reddy

 

Post Midle