బుధవారం కుడా కొనసాగునున్న సీఎం పర్యటన

అమరావతి ముచ్చట్లు:


బుధవారం కుడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అల్లూరి, ఏలూరు పర్యటన కొనసాగనుంది. రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో అయన నేరుగా మాట్లాడతానే. బుధవారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు.. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించిన అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

 

Tags: The CM’s visit will continue on Wednesday

Leave A Reply

Your email address will not be published.