తీర ప్రాంతం అతలాకుతలం

The coastal area is a flood

The coastal area is a flood

Date:11/10/2018
అమరావతి  ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లె సారథి, గొల్లపాడు గ్రామాల మధ్య 3.30 గంటల సమయంలో  తిత్లీ తుపాను తీరాన్ని తాకినట్లు ఆర్టీజీఎస్ అధికారి అహ్మద్ బాబు   ముఖ్్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు వివరించారు.  వజ్రపుకొత్తూరు మండలం పల్లె సారథి, గొల్లపాడు గ్రామాలకు అటుఇటు 50 కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం చూపిన తిత్లీ తుపాను   తీరాన్ని తాకినప్పుడు 110- 130 కిలోమీటర్ల   వేగంతో వీచిన గాలులతో ఆ ప్రాంతం అతలాకుతలమైయింది.  తిత్లీ తుపాను ధాటికి గురువారం తెల్లవారుఝామున   వజ్రకొత్తూరు, పలాస మండలాల్లో నేలకూలిన   కొబ్బరు చెట్లు, కరెంట్  స్థంభాలు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ సమీపంగా తీరం వైపు తిత్లీ తుపాను దూసుకు వస్తోంది.
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత తిత్లీ తుపాను తీరం వైపు దూసుకు రావడంలో వేగం పెరిగింది. తిత్లీ తుపాను  తీరం దాటే సమయంలో  ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు   పడే అవకాశం  బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత  వర్షం జోరందుకుందని   వాతావరణ శాఖ వెల్లడించింది. సోంపేట, పలాస ప్రాంతాల్లో  అధిక వర్షపాతం నమోదయింది. ఒరిస్సా, ఆంధ్రాప్రాంతంలో కురిసే వర్షాల వల్ల వంశధార, నాగావళికి వరదలు వచ్చే అవకాశం వుంది.
తోటపల్లి రిజర్వాయరు నుంచి ఇప్పటికే క్రమక్రమంగా నీటిని విడుదల చేస్తున్నామని  శ్రీకాకుళం కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి అధికమయ్యే కొలదీ జలాశయాల నుంచి అధిక మొత్తంలో నీటిని జలవనరుల శాఖ విడుదల చేయనుంది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  జలవనరుల శాఖ హెచ్చరించింది.
Tags:The coastal area is a flood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *