ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి

The Code of Conduct should be strictly followed

The Code of Conduct should be strictly followed

Date:14/03/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివిధ శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం సచివాలయంలో ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించడంతో పాటు, జిల్లా కలెక్టర్లతో విడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులు కొనసాగించాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలు కోసం కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుకై తీసుకోవలసిన చర్యలను వివిధ శాఖలు మార్చి 31 లోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఎర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను  రాష్ట్రపతి ఉత్తర్వులలో చేర్చేలా చూడాలన్నారు. జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ వివిధ హెచ్ఓడి లు ప్రోఫర్మా-1 ను పూర్తి చేశాయని, తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలను నింపారన్నారు.  రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించనిఎస్.ఓఎస్ఎల్ఓపి-5 లో పూర్తి చేయాలన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం కాంపిటెంట్ అధారిటీ అనుమతితో జి.వోల చేస్తుందన్నారు. తెలంగాణా వెబ్ పోర్టల్ కు సంబంధించి ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించాలని సి.యస్ అన్నారు. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ 573 వెబ్ సైట్స్ ఉన్నాయని, 160 ప్యారామీటర్ల ఆధారంగా జిటిజిదుబ్లు నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లను ఇంటిగ్రేట్ చేసి, స్టేట్ పోర్టల్ తో లింక్ చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటి, యూజర్ ఫ్రెండ్లీ, పి.దుబ్లు ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల సమాచారం, ఆన్ లైన్ సర్వీసెస్, పథకాలు ఉండేలా చూస్తున్నామన్నారు. సులభతర వాణిజ్యానికిసంబంధించి అన్ని రీఫామ్స్ ను ఈనెల 19 వరకు పూర్తిచేయాలని సి.యస్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్స్, హరితహారం, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ రెవెన్యూ, అటవీ భూముల సర్వే, సీజనల్ కండీషన్స్ పై చర్చించారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కమిటి తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ జస్టిస్ సి.వి. రాములు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన పరచటానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఏటిఆర్,ఎఫ్ఏపి ను జిల్లా కలెక్టర్లు సమర్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పర్యటనలో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలతో చర్చించాలన్నారు. నియామాలను జిల్లాలలో అమలు చేసేలా చూడాలన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ ను సైంటిఫిక్ పద్దతిలో డిస్పోజ్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్న ఏజెన్సీలు, నిపుణుల టీం ను జిల్లాలకు పంపుతామన్నారు. ప్రత్యేక కాలపరిమితిని విధించుకొని సైంటిఫిక్ క్యాపింగ్,  బయోప్రాసెసింగ్, బయోమైనింగ్ కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలలో గార్బెజ్ కలెక్షన్, డంపింగ్ యార్డుల పై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్ర స్ధాయిలో తీసుకున్న చర్యల మాదిరిగానే జిల్లా స్ధాయిలో కూడా కమిటీల ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు.కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని సి.యస్ అన్నారు. శిక్షణ పొందిన సర్పంచుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించాలన్నారు. సర్పంచ్ లకు కేటాయించిన నిధుల వినియోగం, విధులు, భాద్యతలు, నియమాలు, గ్రామఅభివృద్ధిపై ప్రత్యేకంగా అవగాహన పొందేలా చూడాలన్నారు. ఈ-పంచాయత్ సాఫ్ట్ వేర్ లో అవసరమైన డాటాను సమర్పించాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ రెవెన్యూ, అటవీ భూముల సర్వేకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, కేవలం 5 జిల్లాలో మిగిలి ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్ జిల్లాలలో 20 సర్వేటీంలు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 53.77 లక్షల ఎకరాలను చేశామన్నారు. ఈ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను కోరారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కలెక్టర్లను కోరారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా వర్క్ షాపు నిర్వహించి గైడ్ లైన్స్ ను జారీ చేసామన్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్, కార్మిక తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలు ఎండబారిన పడకుండా చూడాలన్నారు. మంచినీటి కొరత ఏర్పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ సమావేశంలో స్పెషల్ సి.యస్ లు, అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు శాంతికుమారి, రామకృష్ణారావు, సునీల్ శర్మ, వికాస్ రాజ్, సోమేష్ కుమార్, శాలినీ మిశ్రా, పార్ధసారధి, జగధీశ్వర్, శశాంక్ గోయల్, శివశంకర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, బి.వెంకటేశం, పంచాయతీ రాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags:The Code of Conduct should be strictly followed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *