అమెరికాలో ప్రమాదకర స్థాయికి చేరిన చలి

Date:30/01/2019
మిన్నెసోటా ముచ్చట్లు:
అమెరికాలోని మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. హిమపాతం కారణంగా మిన్నెసోటాలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోయాయి. రహదారులు మంచుతో కూరుకుపోయాయి. విస్కాన్సిన్‌ ప్రాంతంలో చలి తీవ్రత మరింత తీవ్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని స్థానికులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు -20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో జీవిస్తున్నారని అమెరికా జాతీయ వాతారణ సేవల సంస్థ వెల్లడించింది. ఇక ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో -50 డిగ్రీలు, ఇల్లీనాయిస్‌, గ్రేట్‌ లేక్స్‌, మిన్నెపోలీస్‌, డెట్రాయిట్‌, షికాగో తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత తీవ్రమైన హిమపాతం కారణంగా అమెరికాలో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 1,000 విమానాలను రద్దు చేశారు. పోస్టల్‌ సర్వీసులు నిలిచిపోయాయి. పాఠశాలలను మూసివేశారు. యునివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌‌, యునివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాలు తరగతులను రద్దు చేశాయి. షికాగోలు 1985 జనవరి 20వ తేదీన -27 డిగ్రీలు నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు. కానీ తాజాగా -29 డిగ్రీల వరకు చలి నమోదుకావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Tags:The coldest winter in America

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *