కుప్పకూలిన స్టాక్ మార్కెట్

 
-దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్
ముంబై ముచ్చట్లు:
రష్యా- ఉక్రెయిన్ వివాదంలో రష్యా బాంబుల వర్షంతో చేసిన దుస్తాహసంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉక్రెయిన్ లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది.  గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతనమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. దీంతో 10 లక్షల కోట్ల మదుపరుల సంపద కేవలం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది.  భారత స్కాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 2800 పాయింట్లు కోల్పోయి 54530 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో జాతీయ స్థాక్ ఎక్ఛేంచ్.. నిఫ్టీ సూచీ సైతం 815 పాయింట్లు కోల్పోయి 16248 పాయింట్ల వద్ద ముగిసింది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ సూచీ 2164 పాయింట్లు పతనమై.. 35228 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి నెల ఆకరి గురువారం కావడంతో డెరివేటివ్ కాంట్రాక్టులు సెటిల్ మెంట్ చివరి రోజు కావడం దీనికి తోడు ఉదయం రష్యా హ్యూహాత్మకంగా ఉక్రెయిన్ లోని అనేక నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడిందని వార్త ప్రపంచ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 17,00 పాయింట్లు తగ్గి 55,552 వద్దకు చేరుకుంది. విస్తృత NSE నిఫ్టీ502 పాయింట్లు క్షీణించి 16,551 వద్దకు చేరుకుంది. జపాన్ నిక్కీ 2.17 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.66 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.89 శాతం క్షీణించడంతో ఆసియా షేర్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. అలాగే, ఉక్రెయిన్ సంక్షోభం మధ్య 2014 తర్వాత మొదటిసారి బ్రెంట్ చమురు బ్యారెల్ $100కి పెరిగింది. దీనివల్ల పెట్రో ధరలు సైతం ఆకాశాన్ని తాకనున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్ అవెన్యూ అయిన గోల్డ్ లోకి తరలిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల దాని ధర క్రమంగా పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చేంత వరకు ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు మరో వైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మార్కెట్లపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉక్రెయిన్, రష్యా క్రైసిస్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1934 డాలర్లు దాటింది. భారత్‌లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,400 మేర పెరిగింది. దాంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 51,750 దాటింది. వాస్తవానికి ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా అన్ని వస్తువల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం బంగారంపైనా పడింది.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:The collapsed stock market

Leave A Reply

Your email address will not be published.