స్కూల్‌ బస్సు ఢీకొని ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

The condition of two students at the school bus collapses

The condition of two students at the school bus collapses

– పరీక్షలకు వెళుతుండగా దుర్ఘటన
– అన్నా, చెల్లెలకు జరిగిన ఘోరం

Date:15/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

డిగ్రీ పరీక్షలు రాసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్న అన్నా, చెల్లెలు ఇద్దరిని ఓ ప్రైవేటు కళాశాల బస్సు అతివేగంగా వచ్చి ఢీకొని వారి బ్రతుకులను కాలరాచిన సంఘటన సోమవారం పుంగనూరు పట్టణంలోని తోపుమఠం వద్ద జరిగింది. ఈ బాధకర సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం ధర్మవరంపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి(18) , కుమారై మహాలక్ష్మి(17) అన్నా, చెల్లెలు ఇద్దరు కలసి పట్టణంలోని ఎంసివి కళాశాలలో బికాం వెహోదటి సంవత్సరం చదువుతున్నారు. ఇలా ఉండగా సోమవారం పరీక్షలు రాసేందుకు వెంకటరెడ్డి తన చెల్లెలు మహాలక్ష్మిని తీసుకుని ద్విచక్రవాహనంపై పుంగనూరుకు వస్తుండగా మార్గ మధ్యంలో పట్టణంలోని తోపుమఠం వద్దకు రాగా ఎదురుగా పలమనేరుకు వెళ్తున్న మదర్‌థెరిస్సా కళాశాల బస్సు అతివేగంగా వచ్చి వెంకటరెడ్డి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి, మహాలక్ష్మి ఇద్దరు బస్సు క్రిందపడిపోవడంతో ఇద్దరికి తీవ్ర రక్తగాయాలైంది. వెంటనే గ్రామస్తులు ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితులిద్దరిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అన్నా, చెల్లెలు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆ గ్రామంలో తీవ్ర కళకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంసివి కళాశాలయాజమాన్యం విద్యార్థులను పరామర్శించి, సహాయక చర్యులు చేపట్టారు.

 

 

పుంగనూరులో 4జి సేవలు ప్రారంభం

Tags: The condition of two students at the school bus collapses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *