వర్కింగ్ హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నం

హైద్రాబాద్  ముచ్చట్లు:

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని ప్రయి వేట్‌ హాస్టళ్ల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది.గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 5వేలకుపైగా ప్రయివేట్‌ హస్టల్స్‌ ఉన్నాయి. అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, బాగ్‌ లింగంపల్లి, దోమలగుడ, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, తార్నాక ఉప్పల్‌, రామంతాపూర్‌, సికిం ద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కుషా యిగుడ, కాప్రా, హైటె క్‌సిటీ, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌, మలక్‌పేట్‌లో ప్రాంతాల్లో ప్రయి వేట్‌ వర్కింగ్‌ మెన్‌, ఉమెన్‌ హస్టల్స్‌ ఉన్నాయి.హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కొత్త తంటాలు తెచ్చిపెడుతుంది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌, దిగజారిన ఆర్థిక పరిస్థితిలో నగరంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ము ఖ్యంగా సాఫ్టువేర్‌ సంస్థలకు కేంద్రమైన శేరిలింగంపల్లిలో ప్రయివేట్‌ హాస్టల్‌ నిర్వాహకులు, భవన యజమానుల మధ్య వివాదం ముదురుతోంది.

అద్దెల విషయంలో ఏర్పడుతున్న వివాదాలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదుల వరకు వెళ్తున్నాయి. రెండు గ్రూపులు అసోసియేషన్లుగా ఏర్పడి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో పాటు, ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీలకు వెళ్తున్నారు. హైటెక్‌ సిటీ చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 600 వరకు ప్రయివేట్‌ వర్కింగ్‌ హాస్టల్స్‌ పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని హాస్టళ్లు భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఈ అద్దెల మీదే ఆధారపడి భవన యజమానుల కుటుంబాలు జీవనం సాగి స్తున్నా యి. బ్యాంక్‌ లోన్లు తెచ్చి ఇండ్లు నిర్మించిన వారికి, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ అద్దెలే ఆధారం. కరోనా మహ మ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, సాఫ్ట్‌వేర్‌ సంస్థ లు వర్క్‌ ఫ్రామ్‌ హౌం ఇవ్వడంతో హాస్టళ్లు చాలావరకు ఖాళీ అయ్యాయి. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు తాము అద్దెలు చెల్లించలేమని చేతులెత్తేశారు. అసోసియేషన్‌గా ఏర్పడి అద్దెలు చెల్లించొద్దని తీర్మానించారు. కాగా అద్దెల మీదనే ఆధారపడిన భవన యజమానులు అద్దె చెల్లిం చాలని, లేదంటే ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు, భవన యజమానుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు హాస్టల్‌ నిర్వాహకులు భవన యజమానుల మీద పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో, భవన యజమానులు సైతం అసోసియేషన్‌గా ఏర్పడి వీరు ఫిర్యాదు చేశారు. తాజాగా కొండాపూర్‌లో ఉన్న ఓ హాస్టల్‌ వివాదం పోలీసు స్టేషన్‌, స్థానిక ప్రజాప్రతినిధి వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ తమకు అన్యాయం జరిగిందని భవన యజమానులు భావిస్తుండడంతో వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:The condition of working hostels is worse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *