హైదరాబాద్కు మారిన కర్ణాటక రాజకీయం

-ప్రముఖ హోటళ్లకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
Date:18/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. బెంగళూరులోని హోటళ్లలో ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలాగైనా లాగేస్తారని అంచనాకు వచ్చిన కాంగ్రెస్, జేడీఎస్లు కేరళలోని కొచ్చి లేదా తెలంగాణలోని హైదరాబాద్ తరలించాలని నిర్ణయించాయి. మొదట కేరళకే తరలించాలని నిర్ణయించినా గురువారం రాత్రి నిర్ణయం మార్చుకున్న కాంగ్రెస్, జేడీఎస్ లు.. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు ప్రైవేటు టావెల్స్లో తరలించాయి. శర్మ ట్రావెల్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. శుక్రవారం ఉదయం కర్నూలు-హైదరాబాద్ మార్గం గుండా ఈ బస్సులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. వీరందరికి నగరంలోని ప్రముఖ హోటల్లు, రిసార్టులో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కర్నాటక ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు బస చేసే హోటళ్ల ముందు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
Tags; The Congress and the JDS parties are struggling to protect their party MLAs from BJP’s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *