కాంగ్రెస్ వల్లే హోదా వస్తుంది

The Congress comes to power

The Congress comes to power

Date:21/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏపీ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజల ముందు టీడీపీ, బీజేపీ దోషులుగా నిలబడ్డాయని అన్నారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలంతా మోసగాళ్లని ఆయన ఆరోపించారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే హోదా ఫైలుపై తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ-బీజేపీ ఒక్కటేనని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారని, ఓట్ల కోసమే మళ్లీ కొత్త నాటకం అడుతున్నారని రఘువీరా విమర్శించారుప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ, వైసీపీలవి డ్రామాలేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న మోదీ మాటలకు వ్యతిరేకంగా శనివారం ఏపీభవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ‘ఆంధ్రుల హక్కు’ అని.. ప్రధాని హోదాలో ఉండి మోదీ అబద్ధాలాడుతున్నారని ఆరోపించారు.పార్లమెంటులో గల్లా జయదేవ్ బాగా మాట్లాడారాని.. అయితే ఆయన మాట్లాడిన గంట సమయంలో.. అరగంటకు పైగా వారి ముఖ్యమంత్రిని, వాళ్ల పార్టీని, వారి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మరక్షణలో పడ్డారని రఘువీరా ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదాకు ఒప్పుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఆరోజే కోరిందని.. మా మాటలు పెడచెవిన పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని.. టీడీపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మొదటి దోషి అయితే.. రెండో దోషిగా టీడీపీ, మూడో దోషిగా వైసీపీ నిలిచిందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై ఫైల్‌పై సంతకం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ చెప్పినట్లు వైసీపీ డ్రామాలాడుతుందని రఘువీరా ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలంతోపాటు సీపీఐ నేత రామకృష్ణ, ప్రత్యేకహోదా సాధనసమితి నేత చలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వల్లే హోదా వస్తుంది https://www.telugumuchatlu.com/the-congress-comes-to-power/
Tags:The Congress comes to power

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *