పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలి
పుంగనూరు ముచ్చట్లు:
భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, వీరికి తగిన గుణపాఠం నేర్పాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏవి.సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద స్థానిక నాయకులు రాజారెడ్డి, గ ణేష్, నానబాలకుమార్, అయూబ్ఖాన్లతో కలసి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశ ప్రధానులు హత్యగావింపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులలో ప్రధాని మోదీ పర్యటనలో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని , రహదారి బ్రిడ్జిపై ప్రధాని కాన్వాయ్ ఆగిపోవడంతో విస్మయానికి గురి చేస్తోందని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, రాబోవు ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మల్లిక, నానబాలకుమార్, రాజాజెట్టి, బాబు, మహేష్, విజయభాస్కర్‌రెడ్డి, ఆది, ఫారుక్, మణివెహోదలియార్, ప్రసాద్, రాజా, చిన్ని, కిషోర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; The Congress government in Punjab should be taught a lesson