బిజెపి ని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులు 

The Congress is the target of defeating the BJP

The Congress is the target of defeating the BJP

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం వెల్లడి
Date:22/10/2018
చెన్నై ముచ్చట్లు:
ఎప్పటిలా కాకుండా ఈసారి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ సహా ఏ ఇతర నాయకుణ్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని తమ పార్టీ యోచనలో ఉన్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం సూత్రప్రాయంగా వెల్లడించారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది.
ప్రాంతీయ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.‘రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నట్లు మేం ఎప్పుడూ చెప్పలేదు.
కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏఐసీసీ జోక్యం చేసుకుని వారిని అడ్డుకుంది. భాజపాను వెళ్లగొట్టడమే మా లక్ష్యం. వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించే, అభివృద్ధి కోసం పాటుపడే, మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించే, రైతులను ఆదుకునే ప్రత్నామ్నాయ ప్రభుత్వం భాజపా స్థానంలో రావాలని మేం కోరుకుంటున్నాం. భాజపాపై పోరుకు కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
ఎన్నికల అనంతరం భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రధానిని ఎంపిక చేయాలని యోచిస్తున్నాం’ అని చిదంబరం ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నాయని, ఆ పార్టీల వల్ల జాతీయ పార్టీల ఓటు షేరు తగ్గిందని చిదంబరం అన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలపకుండా ఉండేందుకు భాజపా ప్రభుత్వం వారిని భయపెట్టే చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
Tags:The Congress is the target of defeating the BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *