దేశ‌వ్యాప్తంగా రాజ్‌ భ‌వన్‌ ల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న

Date:27/07/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ‌వ్యాప్తంగా రాజ్‌ భ‌వన్‌ ల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని ఆరోపిస్తూ “ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడు”  అన్న నినాదంతో నిర‌స‌నల‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆదివారం ఆన్‌లైన్ వేదిక‌గా సామాజిక మాధ్య‌మాల్లో కాంగ్రెస్ నేత‌లు ఈ మేర‌కు పోస్టులు చేశారు. అలాగే సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాలైన రాజ్‌భ‌వ‌న్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర నేత‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అధికారం, ధ‌న‌బ‌లంతో ప్ర‌జాస్వామ్యంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్ర‌భుత్వాల‌ను ఆ పార్టీ కూల్చుతున్న‌ద‌ని ఆరోపించారు. ఒక వైపు దేశంలో క‌రోనా సంక్షోభం నెల‌కొన్న‌ప్ప‌టికీ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌భుత్వాల కూల్చివేత‌పైనే శ్ర‌ద్ధ చూపుతున్న‌ద‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చిన విధంగానే ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఎమ్మెల్యే ల‌కు డ‌బ్బులు, ప‌ద‌వుల‌ను ఎర‌వేస్తున్న‌ద‌ని ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ నాశ‌నం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

 

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం శవాలతో నిండిపోతున్న గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రి మార్చురీ

Tags:The Congress party protests in front of Raj Bhavans across the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *