కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది
అమరావతి ముచ్చట్లు:
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడిజిల్లా జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ నాయకులు ప్రేమెందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ప్రకాష్ రెడ్డి, అందే బాబయ్య, కరుణాకర్ తదితరులు పాల్గోన్నారు.
కోమటి రెడ్డి నాకు చిరకాల మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు. 2006 నుండి ఈరోజు వరకు పార్టీలు వేరు అయిన అన్యాయాలకు వ్యతిరేకంగా కలిసి కొట్లడుతున్నం. పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు సమాజం అసహ్యించుకునే రీతిలో జుగుప్చాకరంగా ఉన్నాయిని విమర్శించారు.
తిట్టడం, బ్లాక్ మెయిల్, ఇతరుల మనసులు గాయపరచడం ఆయన నైజం. పిసిసి అధ్యక్షు స్థాయిలో కూడా గత భాష, ప్రవర్తన, బ్లాక్ మెయిల్ మర్చిపోలేదు. సంస్కారవంతమన వారు ఈ మాటలు సహించరు. 4 పార్టీలు మారిన వ్యక్తి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను. కాంగ్రెస్ ఎందుకు బాగుపడతలేదు అనే నిస్పృహలతో మాట్లాడినట్టు ఉంది. దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్. 100 సంవత్సరాల చరిత్ర కల పార్టీ అని చెప్పుకునే వారు..75 ఎల్లలో 50 సంవత్సరాలు పాలించిన పార్టీ.. అలాంటి పార్టీ ఎందుకు ఇలా అయిపోయింది అని శోధించి, ఆత్మావలోకనం చేసుకొని, రిపేర్ చేసుకోవాలి. కానీ అది మర్చి పోయి మమ్ముల్ని విమర్శిస్తే ఆయనే పలుచ పడతారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్. అహంకారం వల్ల పతనం అయిన పార్టీ కాంగ్రెస్. ఎంపీలను, ఎమ్మెల్యేలను చివరికి సీఎంలను కూడా లెక్క చేయని పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజానీకాన్ని వంచించిన కారణంగా అది తుడిచిపెట్టుకుపోయింది.
ఎమర్జెన్సీ వ్యతిరేకతలో కూడా 1978లో గెలిచిన చెన్నా రెడ్డి సీఎం అయితే ఆయన్ని మార్చి అంజయ్యను, ఆయన్ని మార్చి భవనం వెంకట్రామిరెడ్డి, ఆయన్ని మార్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డినీ నియమించారు. సంవత్సరానికి ఒక సీఎంను చేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టవద్దు అని ఎన్టీఆర్ కొట్టుడు కొడితే కాంగ్రెస్ దిమ్మ తిరిగింది. 245 పైన సీట్లు ఎన్టీఆర్ గెలిచారు. అప్పుడు ఎలా కాంగ్రెస్ లేకుండా పోయిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగు అవుతుంది. మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే తన భాధ్యత నిర్వహించారు. ప్రజానీకం బీజేపీ-శివసేన కూటమికి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ తన సిద్ధాంత పక్కన పెట్టి.. శివసేన తో అక్రమ పొత్తు పెట్టుకొని దొడ్డి దారిన థాక్రే ను సీఎం చేశారు. దీనికి మహారాష్ట్ర ప్రజలు మదనపడ్డారు. మూల సిద్దాంతం వదిలిన థాక్రే గారిని మహారాష్ట్ర ప్రజలు ఛీ కొట్టారు. ప్రజలకు అనుగుణంగా ఏక్ నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. అన్యాయం చేసింది, దుర్మార్గానికి ఒడిగట్టింది, చిల్లర పనులు చేసింది కాంగ్రెస్. యూపీలో ప్రియాంక నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే 403 స్థానాలకు 2 స్థానాలకు పరిమితం అయ్యింది. రాహుల్ గాంధీ సైతం సొంత ఊరిలో ఓడిపోయి కేరళ పోయారు. కాంగ్రెస్ పతనానికి కారణాలు ఆత్మావలోకనం చేసుకోండి.
ఇతరుల మీద దాడి ఎందుకు? రేవంత్ గారు మీరు తెరాస చెట్టపట్టలు వేసుకొని తిరగడం వాస్తవం కాదా ? మీ మిత్రపక్ష పార్టీలు అయిన హేమంత్ సోరేన్ కు, యూపీలో అఖిలేష్ కి, తమిళనాడులో స్టాలిన్ కి కెసిఆర్ పైసలు పంపింది వాస్తవం కాదా ? కాంగ్రెస్ మిత్ర పార్టీలకు కెసిఆర్ సంపూర్ణ సహకారం ఉన్న తరువాత ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? రాష్ట్ర పతి ఎన్నికల్లో మీరు తెరాస కలిసి మద్దతు తెలపలేదా? ఢిల్లీలో కేటీఆర్, రాహుల్ చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేద ? తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏడ్డోల్లు అనుకుంటున్నారా ? కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల ముందో, వెనుకో పొత్తు ఉంటుంది. మేము ఫిరాయింపులు చేయడం లేదు. ప్రలోభ పెట్టడం లేదు. బాజప్త బహిరంగంగా చేర్చుకుంటున్నమని అన్నారు.

2014 నుండి 18 మధ్యలో.. 12 మంది ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తెరాసాలో కలుపుకున్నారు. 2018 లో.. 88 మంది తెరాస వాళ్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీనీ ప్రతిపక్ష పార్టీగా ఉండమని ప్రజలు గెలిపిస్తే.. మీ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన యాంటీ డిఫెక్టన్ లా ను అధిగమించి 12 మంది ఎమ్మెల్యేలు తెరాస కి పోయారు. మీరు ఏం చేశారని అన్నారు.రాజగోపాల్ రెడ్డి పోవాలి అనుకుంటే ఆయనకు ఆరోజే మంత్రి అయ్యేవారు.. నేనే సాక్షిని. కొట్లడత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో హీరోయిజంగా కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వీడలేదు. 2014 నుండి ఆయన్ని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. కక్ష కట్టి, కాంట్రాక్ట్ రద్దు చేసిన, బిల్లులు ఆపినా తెరాసలో చేరలేదని ఈటల అన్నారు.
Tags: The Congress party was wiped out
