Natyam ad

కానిస్టేబుల్ ఓవరక్షన్ వల్లే కుటుంబం బలి

మాజీ మంత్రి

అనంతపురం ముచ్చట్లు:

హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు కాలు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామంలోహెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన తల్లి షేకున్ బీ, కుమారుడు మన్సూర్ భాష కుటుంబ సభ్యులను  మాజీ మంత్రి కాల్వశ్రీనివాసులుపరామర్శించారు. కర్ణాటక ప్రాంతమైన బళ్లారి విమ్స్ లో మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.మైనార్టీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు.సమాజంలో బాధ్యులైన పౌరులుగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.ఇద్దరి మృతి, మరొక పరిస్థితి విషమంగా ఉండడానికి కారకుడైన  హెడ్ కానిస్టేబుల్ రఘునాథ రెడ్డి పై చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.జిల్లా ఎస్పీ స్పందించకపోతే బాధిత కుటుంబాన్ని న్యాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరికలు చేశారు.పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ముస్లిం మైనారిటీ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందించే ఆదుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: The constable’s overaction is the victim of the family

Post Midle

Leave A Reply

Your email address will not be published.