The Constitution Amendment laws should be repealed

రాజ్యంగ సవరణ చట్టాలను రద్దు చేయాల్సిందే

– మనుధర్మశాన్ని అమలు సహించేది లేదు
– ముస్లింల బహిరంగ సభలో అఖిలపక్షం హెచ్చరిక

Date:19/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పౌరసత్వచట్టం సవరణలను రద్దు చేయాల్సిందే. అలాకాకుండ రాజ్యాంగాన్ని ముక్కలు చేసి దాని స్థానంలో మనుధర్మశాన్ని అమలు చేసి, దేశంలో హిందూవులు మాత్రమే జీవించేలా బిజెపి ముస్లింలను , దళితులను, క్రైస్తవులను తరిమివేయాలని చూస్తే సహించేది లేదని ముస్లింల అఖిలపక్ష బహిరంగ సభలో వివిధ మతాలకు చెందిన నాయకులు కేందప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. ఆదివారం రాత్రి పుంగనూరు ఎన్‌ఎస్‌.పేట మైదానంలో ముస్లింలు నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది హాజరైయ్యారు.ఈ సభకు ముఖ్యఅతిధులుగా ఆల్‌ఇండియా ముస్లిం పర్శనల్‌ లాబోర్డ్ మెంబర్‌, జమియతుల్లా ఉలమా అధ్యక్షుడు మౌలనాముఫ్తీ సయ్యద్‌ మసూమ్‌సాఖిబ్‌సాహెబ్‌, జమాతే ఇస్లామి హింద్‌ ఇస్లామిక్‌ రాష్ట్ర కార్యదర్శి మౌలనాఅబ్ధుల్‌ సుబహాన్‌సాహెబ్‌, కర్నాటక వక్ఫ్బోర్డ్ మెంబరు మహమ్మద్‌జూల్ఫీకర్‌అలీ, మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ యమలా సుదర్శన్‌ , సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, జిల్లా రైతు సంఘ నాయకుడు జనార్ధన్‌, జైన్‌ఫాస్టర్‌ హాజరైయ్యారు. ఈ సభలో జమాతే ఇస్లామిహింద్‌ రాష్ట్ర కార్యదర్శి మౌలనా అబ్ధుల్‌సుబహాన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పౌరసత్వ చట్టానికి సవరణ చేసి ముస్లింలకు మనుగడ లేకుండ చేసేందుకు కుట్రలుపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు సిద్దంకావాలన్నారు. కర్నాటక వక్ఫ్బోర్డ్ మెంబరు మహమ్మద్‌జూల్ఫీకర్‌అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఏకులస్తులైన , ఏ మతస్తులైన జీవించేహక్కు ఉందన్నారు. కానీ హిందుస్తాన్‌ హామరా అనే పదానికి అర్థంలేకుండ మతంపేరుతో బిజెపి ప్రభుత్వం విడగొడుతోందని తెలిపారు. ఇలాంటి చర్యలను ఎదుర్కొంటామని ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేశారు.

 

 

 

 

సీపీఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య మాట్లాడుతూ పౌరసత్వం పేరుతో ప్రభుత్వం చేసే విచారణలకు రూ.50 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ డబ్బు ఎలా ఖర్చు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం ఎక్కడిదంటు నిలధీశారు. తాతలముత్తతాల పుట్టిన ధృవీకరణపత్రాలను ఎలా చూపించాలంటు ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ , జనసంఘ్‌తో బిజెపి తొత్తుగా మారి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. దీనిని రద్దు చేసేదాక పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముస్లింలపై వేటువేస్తోందన్నారు. మాజీ మంత్రి ఎల్‌కె.అధ్వాని లాహ్గర్‌లో జన్మించారని , ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయగలరా అంటు నిలధీశారు. జిల్లా రైతు సంఘ కార్యదర్శి జనార్ధన్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ , ఎన్‌ఆర్‌పీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పౌరసత్వ సర్వేలతో ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులేకుండ చేసేకుట్రలో భాగమని తెలిపారు. కోట్లాది మంది జనాభా కలిగిన ముస్లింలకు పార్లమెంట్‌లో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను ముఖ్యంగా ఆదిలోనే తుంచివేయాలన్నారు.

 

 

 

 

 

సమస్యలు పెరిగితే సమాజాన్ని దహించివేస్తుందన్నారు.ముస్లింలకు మద్దతుగా అన్ని వర్గాలు కలసి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండ ఎదుర్కుంటామన్నారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి యమలా సుదర్శనం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి మతాన్ని అణచివేస్తోందని తెలిపారు. కేరళ , బెంగాల్‌లో మాదిరి పౌరసత్వసవరణ చట్టాన్ని అమలు చేయమంటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు హామి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా సభలో నేతల ప్రసంగాలకు ముస్లింల హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. హిందుస్థాన్‌ అమరా….అంటు యువకులు ఉర్ధూలో దేశభక్తి గీతాలు ఆలాపించడం సభను ఉత్తేజపరిచింది. ఈ సమావేశంలో స్థానిక ముస్లిం నాయకులు షా, అమ్ము, ఇనాయతుల్లాషరీఫ్‌, ఎంఎస్‌.సలీం, ఫకృద్ధిన్‌షరీఫ్‌, కిజర్‌ఖాన్‌, అఫ్సర్‌, ఇబ్రహిం తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ , సీసీఏలను రద్దు పరచాలి

Tags: The Constitution Amendment laws should be repealed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *