పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేశం కార్యకర్తలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో చేరారు. ఆదివారం స్థానిక నాయకులు అస్లాంమురాధి ఆధ్వర్యంలో దేశం కార్యకర్తలు మహమ్మద్, మన్సూర్, రిజ్వాన్, ఉస్మాన్, ఫరాజ్, అసిఫ్, నయాజ్, మున్నా, నూర్‌మహమ్మద్, మహమ్మద్‌వారీస్, ఎంఎస్.వసీమ్, సుహేల్‌మాలిక్ లకు మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. మైనార్టీలు అధిక సంఖ్యలో పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags; The country workers joined the party in the presence of Minister Peddireddy in Punganur
