The countryside is the land of the wall

సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లె సీమలు

Date:14/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

సంక్రాంతి సంబరాలకు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు సిద్దమౌతోంది. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈనెల 31 వరకు వివిధ సార్లు జరిగే సంక్రాంతి సంబరాలకు ఇతర ర్ఖా•లలో ఉన్న బంధుమిత్రులు పట్టణాల నుంచి పల్లెలు చేరుకున్నారు. పుంగనూరు పట్టణంలోని దుకాణాలలో రంగు కాగితాలు, బెలూన్లు, తాళ్లు, గజ్జలు, రంగురంగుల ముగ్గుపిండి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంక్రాంతి పండుగ ఘనంగా చేయడానికి పల్లెలు ముస్తాబౌతున్నాయి. 14 నుండి 16 వరకు వరుసగా చేసే బోగి పండుగ మంగళవారం వేకువజామున బోగి మంటలు వేశారు. మకర సంక్రాంతి, కనుమ పండుగ ఏర్పాట్లలో గ్రామస్తులు బిజి బిజిగా ఉన్నారు. పండుగ కు స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి, తంగేడు, తీండ్ర పూలతో ఆలంకరిస్తున్నారు. 15, 16 బుధ, గురువారాలలో మకర సంక్రాంతి , కనుమ పండుగల సంద ర్భంగా ప్రతి ఇంటా పశువులను నీటితో శుభ్రం చేసి, గంటలు, గజ్జలు, బెలున్‌లు కట్టి ఊరేగింపు చేస్తారు. పంట పొలాల్లో పూజలు చేస్తారు. కనుమ పండుగ కూడ కావడంతో గ్రామ పొలిమేర్లలోకి పశువులను తీసుకెళ్లి అక్కడ కాటమరాజు ఆలయాల వద్ద పూజలు చేసి, చిట్లాకుప్పలకు నిప్పు పెట్టి, పశువులను ప్రదక్షణ చేయించి, జంతుబలులు సమర్పిస్తారు. ఇలా చేస్తే పశువులు వృద్ధి చెందుతుందని నమ్మకం. పండుగ సందర్భంగా గొబ్బెమ్మలతో మహిళలు ఇంటింటికి వెళ్లి యాచన చేస్తారు. అలాగే గంగిరెద్దులను తీసుకెళ్లి ప్రదర్శన చేస్తారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు నూతన వస్త్రాలు ధరించి , రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఉంచి జానపద గీతాలు ఆలపిస్తారు. ఈ సందర్భంగా పితుకుపప్పు, దోసెలు, మాంసాహారాలతో, బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగిస్తారు.

రాజ‌ధానుల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయ0

Tags: The countryside is the land of the wall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *