పల్లెప్రగతిని పరుగులు పెట్టించాలి

– బోయిన్ పల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్

చొప్పదండి ముచ్చట్లు:

చొప్పదండి నియోజకవర్గం బోయినిపల్లి  మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్  అధ్యక్షతన ఎంపిడిఓ నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు వారి నివేదికను చదివి వినిపించారు.పలువురు ప్రజాప్రతినిధుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు,రివ్యూ జరుగుతున్న సమయంలో మండల కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ మాట్లాడుతూ స్త్రీ స్వశక్తి భవనం అసంపూర్తి గా ఉందని మండల కేంద్రం 816 మహిళా గ్రూపులకు గాను,9315 మహిళా సభ్యులు ఉన్నారని,ప్రతి నెల రెండుసార్లు సమావేశ నిమిత్తం మండల కేంద్రానికి వస్తారని,అరకొర సౌకర్యాలతో ఉన్న పాత భవనంలో కాలం వెళ్లదిస్తున్నారని,కావున నూతన భవనం వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా సందర్భంగా పోటీపరీక్షలలో పాల్గొనే నిరుద్యోగ యువతకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని గ్రంధాలయ ఛైర్మెన్ ఆకునూరి శంకరయ్యను కోరారు.అనంతరం  ఎంపిపి పర్లపల్లి  వేణుగోపాల్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం  పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూస్తామన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేసి పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.అధికారులు రాబోయే సమావేశాల్లో పూర్తి స్థాయి   నివేదికను తీసుక రావాలని, మండలంలోని అన్ని సమస్యలపైనా నివేదికలను ఇవ్వాలన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలసి పని చేయాలని అన్నారు.ఈ నెల20 నుండి పల్లెప్రగతి విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య,తహశీల్దార్‌ మజీద్,వైస్ ఎంపీపీ నాగయ్య,సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లేశం,రైతు బంధు కన్వీనర్ లచ్చిరెడ్డి,మండల కో- ఆప్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ,సర్పంచ్ లు, ఎంపీటీసీలు,వ్యవసాయ అధికారిని,ప్రణీత ఎం.ఈ.ఓ. శ్రీనివాస దీక్షీతులు,వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Tags: The countryside must be run