ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

-ప్రియురాలు మృతి…..ప్రియుడికి తీవ్రగాయాలు

విశాఖపట్నం ముచ్చట్లు:


రైల్వే ట్రాక్ పై ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటనలో రైలు ఢీకొనడంతో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.విశాఖజిల్లా పెందుర్తి మండలం పరిధిలోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్న కొణతాల హేమకు గతంలో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తగా దూరంగా పిల్లలతో కొత్తపాలెంలో ఆమె ఉంటుంది. ఈ తరుణంలో కోట నరవ ప్రాంతాన్ని చెందిన కుమార్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వీరిద్దరి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది ఇలా ఉండగా శనివారం ఉదయం సత్తివానిపాలెం రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ట్రాక్ పై వస్తున్న రైలుకి ఎదురుగా పడిపోయి ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయాలై హేమ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రియుడు కుమార్ గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రియుడు కుమార్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. హేమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా తల్లి మృతి చెందడంతో ఇద్దరి చిన్నారులు అనాధలుగా మారిపోవడం అక్కడివారిని కలిచివేసింది. సిఐ అశోక్ కుమార్ నేతృత్వంలో పెందుర్తి ఎస్సై గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: The couple attempted suicide

Leave A Reply

Your email address will not be published.