ఇన్ సైడర్ ట్రేడర్ పిటీషన్ కొట్టేసిన కోర్టు

Date:19/01/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ పోలీసులు కేసులు నమోదు చేయగా.. వాటిని కొట్టివేయాలంటూ కిలారి రాజేష్‌‌తో పాటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.భూములు అమ్మిన వారెవరూ ఫిర్యాదులు చేయలేదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం కిలారి రాజేష్ మరి కొందరిపై కేసులను ధర్మాసనం కొట్టివేసింది.కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. సీఐడీ కేసులను హైకోర్టు కొట్టేయడంతో జగన్ సర్కార్‌కు చుక్కెదురు అయ్యింది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags;The court struck down the Insider Trader petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *