న్యాయస్థానాలకు సాక్ష్యాలు అవసరం

The courts need witnesses

The courts need witnesses

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:15/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలు తమ సమస్యలను దావాలుగా వేసినప్పుడు వాటిని రుజువు పరిచేందుకు ప్రతి ఒక్కదానికి సాక్ష్యం అవసరమని , దానిని పత్రం రూపంలో జతపరిస్తే బలం చేకూరుతుందని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. సోమవారం మండలంలోని ఈడిగపల్లె గ్రామంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు.ఈ సమావేశానికి న్యాయమూర్తి బాబునాయక్‌ హాజరై ప్రసంగిస్తూ లోక్‌అదాలత్‌ల ద్వారా ప్రజలకు సత్వరన్యాయం అందించడంతో పాటు దానిపై అప్పీల్‌ ఉండదన్నారు. ఈ అవకాశాలను గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు చట్టం, న్యాయం పట్ల అవగాహన పెంచుకుని హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని పిలుపునిచ్చారు. సాదారణంగా న్యాయస్థానాలలో మాకు హక్కు ఉందనే విధంగా చెబుతుంటారని , వాటిని న్యాయస్థానాలు పరిగణలోనికి తీసుకోవడం కష్టమన్నారు. ఉదాహరణకు భూమి మీదైనప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు, రెవెన్యూ రికార్డులు మీ పేరున ఉంటే వాటిని కోర్టు పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. ఇలాంటి సమస్యలు లేకుండ ప్రతి ఒక్కరు పత్రముల రూపంలో రాసుకోవడం, ఇచ్చి,పుచ్చుకోవడం చేసుకుంటే సమస్యలు ఉత్పన్నంకాకుండ ఉంటుందన్నారు. న్యాయస్థానాలలో చట్టనిబంధనల మేరకు తీర్పులు వెలువరించడం జరుగుతుందన్నారు. ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్‌లను ఆశ్రయించాలన్నారు. ఈ సమావేశంలో లోక్‌అదాలత్‌ మెంబర్లు ఎలినార్‌ ప్రశాంతి, సుబ్రమణ్యం, సర్పంచ్‌ అమరనాథ్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

 

సేవాలాల్‌ టి-20 క్రీకెట్‌ పోటీలలో విజేతలు తాండ టీమ్‌

Tags: The courts need witnesses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *