గోమాతకు శ్రీమంతం
మచిలీపట్నం ముచ్చట్లు:
మచిలీపట్నం చింతగుంట పాలెం లో తెలుగు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు ఇంటి వద్ద సంప్రదాయ సిద్ధంగా గోమాతకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదపండితులు గోమాతకు అర్చనలు నిర్వహించారు. చింతగుంట పాలెం లో గో ప్రేమికులు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి సోమశేఖర్, లంక శెట్టి నీరజ, పాలపర్తి పద్మ , కార్పోరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ స్వయంగా గోమాతకు అర్చనలు నిర్వహించారు. మహిళలు గో ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం మచిలీపట్నం నగరంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది.హిందూ సంప్రదాయానికి అద్దం పట్టింది గోమాతను ప్రత్యక్షదైవంగా భావించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ సందర్భంగా గో ప్రేమికులు పేర్కొన్నారు.
Tags: The cow is rich