పట్టణ ప్రజలపై పన్నుల భారాన్ని పెంచే చట్టాన్ని వ్యతిరేకించిన సిపిఎం

Date:02/12/2020

నెల్లూరు  ముచ్చట్లు:

పట్టణ ప్రజల పై పన్నుల భారాన్ని పెంచే మున్సిపల్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ ను తగలబెడుతూ. నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం దృష్టితో కాకుండా పట్టణ ప్రజల పై భారం మోపి ఆర్డినెన్స్, ఇతర బిల్లులను ఆమోదింప చేయడం కోసం మొక్కుబడిగా ఈ సమావేశాలను ప్రభుత్వం జరుపుతుంది. అని అన్నారు. ఆస్తిపన్ను భారాలు మోపేందుకు 6 మున్సిపల్ చట్టాలకు సవరణ కు  తీసుకు వస్తూ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసింది అన్నారు ఈ ఆర్డినెన్సకు శాసన సభలో చట్ట రూపం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా అన్యాయమని అన్నారు.

 

 

క్రమంగా ప్రైవేటు కంపెనీలకు పౌర సదుపాయాలు ధారాదత్తం చేసే కుట్రలు ఇమిడి ఉన్నాయని ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఆదేశాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం చట్టాల మౌలిక స్వభావం మార్చేసింది అని, అందుకే తక్షణ పన్నుల భారలతో పాటు విధానాల ప్రమాదాన్ని ప్రజలు గుర్తించాలని దశల వారీ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్ గారు మాట్లాడుతూ. ప్రభుత్వం మంచి నీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ ఛార్జీలు పెంచడానికి వీలుగా 196,197 నెంబర్ జీవోలను విడుదల చేయడం అన్యాయమని అన్నారు. పారిశుద్ధ్యం, చెత్త మీద, అన్ని పౌర సదుపాయాలు మీద, నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే విధంగా చార్జీల వసూలుకు చట్టంలో లో కొత్త నిబంధనలు పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ చట్ట సవరణ రద్దు చేయాలని కోరినారు. పై కార్యక్రమంలో సిపిఎం రూరల్ నాయకులు, బత్తల కిష్టయ్య, కిన్నెర కుమార్, కొండా ప్రసాద్, రమమ్మ, ఎస్ కె షాహినా బేగం, జిలాని, ఎం సుధాకర్, ఎస్ కే భాష, సుబ్రహ్మణ్యం, కంటి కోటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.

 ఫైజర్ టీకా రెడీ

Tags: The CPM opposed the law that would increase the tax burden on urban people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *