విపక్షాల విమర్శలే మనకు దివేనలు

The criticisms of the opposition are disastrous

The criticisms of the opposition are disastrous

Date:19/10/2018
అమరావతి ముచ్చట్లు:
తుపాన్ నష్టం చూసేందుకు కేంద్రంలో బిజెపి నేతలు రాలేదు. బాధితులపై ఒక్క సానుభూతిమాట లేదు. తక్షణ సాయంగా డబ్బులు ఇవ్వలేదు. వైసిపి రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతోంది.పవన్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడు.కెటిఆర్ వేరే రాష్ట్రం నుంచి పవన్ ను అభినందిస్తాడు. రాజమండ్రి కవాతును ప్రశంసిస్తాడు. తిత్లీ బాధితులపై సానుభూతి మాత్రం ప్రకటించాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇన్ చార్జ్ లు,ప్రధాన కార్యదర్శులు పాల్గోన్నారు. ఓటర్ల నమోదు,కౌన్సిల్ ఎన్నికలు,బూత్ కన్వీనర్ల శిక్షణ,గ్రామ వికాసం పురోగతిపై సమీక్ష జరిపారు. చంద్రబాబు మాట్లాడుతూ వీళ్లందరూ కలిసి పనిచేస్తున్నారు అనేదానికి ఇవే రుజువులు.
బిజెపి, వైసిపి,   టిఆర్ఎస్, జనసేన నలుగురూ టిడిపినే టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రం కోసం మనం పోరాడుతున్నాం. ప్రత్యర్ధి పార్టీలు మనపై పోరాటం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు మనలను ఎంతో అభిమానిస్తున్నారు.ప్రజాభిమానం మనపైనే ఉంది. అదిచూసి ప్రత్యర్ధి పార్టీలు అక్కసు పెంచుకున్నాయి.ప్రజలకు దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నాయి. ప్రజలనుంచి స్పందన అద్భుతంగా ఉంది.సంతృప్తి శాతం 57 శాతం నుంచి 76 శాతం కు పెరిగింది.‘మళ్లీ మీరే రావాలి’ అని సామాన్యులు,పేదలు నినాదాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదు.అతని ఫాక్షన్ మనస్తత్వమే దానికి కారణం. చిత్తశుద్దితో పాదయాత్ర చేయడం లేదు.డ్రామాగా పాదయాత్ర చేస్తున్నాడు. ఇలాగే మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం రాదు.
దేనికైనా విజన్,ఎగ్జిక్యూషన్ ఉంటేనే అవుట్ కమ్స్ ఉంటాయనివ్యాఖ్యానించారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండటం ఆనందం. గ్రామాలకు పోవడం ఒక మంచి అలవాటు. కేంద్రం నుంచి సహాయంలేదు. పైపెచ్చు ఎదురుదాడులు చేస్తోంది.వాళ్లు ఏది చేసినా బూమ్ రాంగ్ అవుతోంది.బిజెపి, వైసిపి,టిఆర్ ఎస్,జనసేన మనల్ని ఎంత టార్గెట్ చేస్తే మనకు అంత లాభం. వాళ్ల తిట్లే మనకు ప్రజాదీవెనలు. ప్రజాభిమానమే మన నైతిక బలం.దాంతోపాటు నేను ఒక్కడినే కష్టపడితే చాలదు.మొత్తం పార్టీ బృందం అంతా కష్టపడాలి. ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ప్రజల్లో ఉంటే పార్టీపై 70 శాతం  సంతృప్తి ఎందుకు రాదని అన్నారు. ఓటర్ల  నమోదుకు,మార్పుచేర్పులకు చివరి తేది అక్టోబర్ 31. అందరూ ఉత్సాహంగా ఓటర్ల నమోదులో పాల్గొనాలి.సమాచారం మొత్తం ప్రతి నియోజకవర్గానికి పంపించాం.
పట్టభద్రుల నుంచి కౌన్సిల్ ఎన్నికలో ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి. టిఎన్ ఎస్ ఎఫ్ తో పాటు నాయకులు అంతా చురుగ్గా పాల్గొనాలి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కౌన్సిల్ ఎన్నికకు ఓటర్ల నమోదు చివరితేది నవంబర్ 6. చిత్తశుద్ది లేకుండా పనిచేస్తే ఫలితాలు రావు.సామర్ధ్యం పెంచుకోకపోతే ఫలితాలు రావు. మొత్తం 45,920బూత్ కన్వీనర్లకు శిక్షణ 67% పూర్తయ్యింది.మిగిలింది కూడా వెంటనే పూర్తి చేయాలి. అనంతపురం, నంద్యాల,న ర్సాపురం, నెల్లూరు,అరకు పార్లమెంట్ లలో శిక్షణ ఊపందుకోవాలి. గ్రామవికాసం’ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలి. ఇప్పటిదాకా 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి.ఇంకా 11,532గ్రామాలు, వార్డులలో జరపాల్సివుంది.
అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎన్నికల్లో గెలవపోతే గౌరవం రాదు.ప్రజా సేవ చేసే అవకాశం  ఉండదు. ఎప్పటికప్పుడు ప్రత్యర్ధిపార్టీల కుట్రలను తిప్పికొట్టాలి. లాలూచి రాజకీయాలను ఎండగట్టాలి. నేను చెప్పింది చెప్పినట్లు చేయండి.ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది.ప్రజా సేవ చేసే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజూ సగం సమయం పార్టీకే కేటాయిస్తాను. తెలుగుదేశం మిషన్ 2019ఎలక్షన్ అని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ సైనికుల్లా ముందుకు ఉరకాలి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి.మన పూర్తి శక్తి సామర్ధ్యాలను గెలుపుపై పెట్టాలి. రాత్రికి రాత్రి నాయకుడు ఉద్భవించడు. సుదీర్ఘకాలం కృషిచేస్తేనే నాయకుడు అవుతారని అన్నారు.
Tags:The criticisms of the opposition are disastrous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *