-నది ఒడ్డున ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న కర్ణాటక పోలీసులు.
Date:04/12/2020
రాయచూరు ముచ్చట్లు:
జిల్లా డి.రాంపూరం గ్రామంలోని బుధవారం, రాంపూర్ గ్రామంలోని మల్లికార్జున్ అనే 12 ఏళ్ల యువకుడు తన 5మంది స్నేహితులతో కలిసి పశువులను మేపడం కోసం వెళ్ళారు. అయితే బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నదిఒడ్డున్న మల్లికార్జున్ అనే యువకుడు తనకు దాహం తీర్చుకొనేందుకు తోటి స్నేహితులు ఉన్నస్థలం నుంచి కాస్త దూరంలో వెళ్లగా అకస్మాత్తుగా నీటిలో మునిగి పోయాడు. అయితే తోటి స్నేహితులు కేకలు వేయడంతో గ్రామ ప్రజలు అక్కడ గాలించగా అంతలోపే మల్లికార్జున్ ముసలి చేతిలో బలైయ్యాడు.అయితే గురువారం తెల్లవారుజామున 2 గంటలకు మల్లికార్జున తల మాత్రమే ఒడ్డుకు చేరింది.ఈ విషయంపై గ్రామస్తులు యాపలదిన్నె పోలీసులకు సమాచారం అందించారు.కర్ణాటక కృష్ణానది ప్రాంతంలో ఇప్పటికి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
కృష్ణానదిలో చాలా మొసళ్ళు ఉన్నందున, నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు చాల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Tags:The crocodile that swallowed the young man