మహిళలను కించపర్చే సంస్కృతి వైసీపీదే

The culture that demands women is a virgin

The culture that demands women is a virgin

Date:14/01/2019
అమరావతి ముచ్చట్లు:
మహిళలను కించపర్చే సంస్కృతి వైసీపీదేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమవారం వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిళ చేసిన వ్యాఖ్యలపై ఆమె  స్పందించారు. స్త్రీలను తోబుట్టువులుగా భావించే పార్టీ టీడీపీ అని ఆమె మహిళా ఎమ్మెల్యేలను సైతం కంటతడి పెట్టించిన వ్యక్తి జగన్ అని ఆరో్పించారు. షర్మిళతో పాటు ఏ మహిళపై ఇలాంటి ప్రచారం జరిగినా టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని సునీత పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పనిచేసే పార్టీ టీడీపీ అని అన్నారు. మహిళా ఐఏఎస్ అధికారులు, మహిళా మంత్రులను జైలుపాలు చేసిన చరిత్ర జగన్‌దేనని పరిటాల సునీత ఆరోపించారు. వికృత క్రీడకు సోషల్ మీడియాను కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది జగనేనని మంత్రి విమర్శించారు. ఆంధ్రా పోలీసులపై తమకు నమ్మకం లేదని షర్మిళ అనడం సరికాదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం లేనప్పుడు ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా వైసీపీకి లేదని ఆనందసూర్య అన్నారు.
Tags:The culture that demands women is a virgin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *