.యాజమాన్యం   నిర్లక్ష్యంతో  సిలిండర్ పేలింది

– హోటల్ కు ఫైర్ శాఖ అనుమతులు ఉన్నాయా
-ఒక సిలిండర్ వెళితే 11 మంది కి గాయాలు 5 సిలిండర్ వెళితే….?
– సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబంది
Date:09/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
.హైదరాబాద్ కొత్తగూడలో ఉన్న షా గౌస్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం సమయం కావడంతో కస్టమర్లు,హోటల్ సిబ్బందితోకిక్కిరిసి ఉంది.ఆ సమయంలో కిచెన్ నుంచి భారీ శబ్దం తో గ్యాస్ సిలిండర్ పెళ్లి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కిచెన్ లో ఉన్న మహిళలకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి.
సకాలంలో ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపు చేసాయి.అప్పటికే మరో సిలిండర్ గ్యాస్ లీకు కావడంతో ఫైర్ సిబ్బందు అదుపు చేశారు.అక్కడే ఉన్న మరో నాలుగు సిలిండర్ లు పక్కకు తొలగించడంతో భారీ ప్రమాదం తప్పింది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి చెప్పారు.సరైన రక్షణ చర్యలు వైసికొకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది.
Tags: The cylinder exploded with the management neglect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *