ముదురుతున్న జోడి వివాదం

The darker controversy

The darker controversy

 Date:06/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ వరుస సినిమాలో బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఆదితో ‘జోడీ’ చిత్రంలో జోడీ కట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వివాదాన్ని చుట్టేసింది. జోడీ చిత్రానికి అసలు నిర్మాతను నేనే అంటూ గుర్రం విజయలక్ష్మి ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిర్మాత‌గా మంచి సినిమా నిర్మించాల‌నే కోరిక ఉన్న నేను ఎక్కువుగా అమెరికాలో ఉండ‌టం వల్ల ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్.. ఉప్ప‌ల‌పాటి అనురాధ‌ నిర్మాతగా ప‌రిచ‌యం చేసారు. ఇక్క‌డ నిర్మాణ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నాకు వెసులుబాటుగా ఉంటుంద‌ని ఉప్ప‌ల‌పాటి అనురాధా గారి భాగ‌స్వామ్యంలో సినిమా నిర్మాణానికి నేను అంగీక‌రించాను. అనురాధా కుమారుడు చ‌ర‌ణ్ తేజ్ నాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అమ్మ‌డం జ‌రిగింది. ఈ విష‌యంలో నేను చాలా షాక్‌కి గురైయ్యాను. నిర్మాణంలో మేజర్ షేర్ కలిగిన నా అనుమతి లేకుండా మోసం చేసి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మారు. ఇప్పుడు సినిమా నిర్మాత‌లం మేమే అంటూ వారిచ్చిన కంప్లైట్ నిజంగా చాలా దారుణం. మోసం చేసిన వారే మోసం పోయాం అంటూ ముస‌లి క‌న్నీళ్ళు కార్చుతున్నారు. దొంగే .. దొంగ దొంగ అని అరిచిన‌ట్లు వీరి వ్య‌వ‌హారం ఉంది. ఈ సినిమా విష‌యంలో అన్ని రుజువులు మా వ‌ద్ద ఉన్నాయి.
మాకు తెలియ‌కుండా సినిమా హాక్కుల‌ను అమ్మ‌డ‌మే కాకుండా సినిమా వారిదే అంటూ వారిచ్చిన ఫిర్యాదుపై మేము న్యాయ‌ పోరాటానికి దిగ‌బోతున్నాం’ అన్నారు. ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. గుర్రం విజ‌య‌ల‌క్ష్మి గారికి ఉప్ప‌ల‌పాటి అనురాధా గారిని నేను ప‌రిచ‌యం చేసాను. సినిమా ద‌ర్శ‌కుడిగా సినిమా నిర్మాత‌కు న‌ష్టం వాటిల్లుతుంటే నేను చూస్తూ ఊరుకోను. సినిమా కంప్లీట్ కాకుండానే హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ని వాళ్ళు ఎవ‌రికీ తెలియ‌కుండా అమ్మేసారు. ఇంత మోసం చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. విజ‌య‌ల‌క్ష్మి గారు విలువ‌ల‌తో బ్ర‌తికే మ‌నిషి. సినిమాప‌ట్ల ఉన్న ప్యాష‌న్‌తో ఈ రంగం వైపు అడుగు పెట్టారు. ఆమె ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చాల‌ని చూస్తే వారు కోర్టులో స‌మాధానం చెప్ప‌కోవాల్సివ‌స్తుంది. సినిమా పూర్తి అయి, ప్ర‌మోష‌న్స్ ప్లాన్‌లో ఉండ‌గా ఈ వార్త మ‌మ్మ‌ల్ని క‌ల‌చివేసింది. త‌ప్ప‌కుండా న్యాయం పోరాటం చేసి సినిమాని విడుద‌ల చేస్తాం’ అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంత‌ర ప‌నుల్లో ఉన్న ఈ మూవీలో ఆది, శ్ర‌ద్దా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. న‌రేష్, స‌త్య‌, వెన్నెల కిషోర్, సిద్దు, స్వ‌ప్నిక‌, సితార‌, మాధ‌వి, గొల్ల‌పూడి మారుతీరావు వ‌ర్షిణి సౌంద‌రరాజ‌న్, ప్ర‌దీప్ తదితరలు ఇతర పాత్రల్లో న‌టించారు. భావ‌నా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ గుర్రం స‌మ‌ర్పణ‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:The darker controversy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *