The daughter is forever entitled to a share in the father's property: Supreme Court

కూతురు ఎప్పటికీ తండ్రి ఆస్తిలో వాటాకు హక్కుదారే : సుప్రీంకోర్టు

Date:11/08/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, సంఘంలో గౌరవం, కుటుంబంలో సమానత్వం వంటి విషయాల్లో మరొక ముందడుగు పడింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, తండ్రి ఆస్తిలో వాటా పొందేందుకు హక్కుదారేనని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి రావడానికి పూర్వమే తండ్రి మరణించినప్పటికీ, ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు ఆయన కుమార్తెకు ఉంటుందని, ఆమె సమష్టి కుటుంబ భాగస్థురాలేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమలు గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి హిందూ కుటుంబంలోని కుమార్తె సమష్టి కుటుంబ సహభాగస్థురాలు అవుతుంది. కానీ ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినపుడు ఆయన కుమార్తెకు ఈ హక్కు ఉంటుందా? అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇచ్చింది.

 

 

 

 

ఈ వివరణతో మహిళలకు కుటుంబంలో సమాన గౌరవం, హోదా, హక్కులు లభిస్తున్నాయి.ప్రకాశ్ వర్సెస్ ఫూల్‌వతి కేసులో సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రాకముందు కుమార్తెలకు హక్కులు ఉండవు. దానమ్మ వర్సెస్ అమర్ కేసులో సుప్రీంకోర్టులోని వేరొక ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినప్పటికీ, ఆయన ఆస్తిలో ఆయన కుమార్తెకు హక్కు ఉంటుంది, ఆమె ఆ సమష్టి కుటుంబ సహభాగస్థురాలే. ఈ రెండు తీర్పులు విభిన్నంగా ఉండటంతో దీనిపై వివరణ కోరారు. దీంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇచ్చింది.‘‘ఈ చట్టంలోని సెక్షన్ 6 ద్వారా కుమార్తెలకు కల్పించిన సమానత్వ హక్కును పోగొట్టరాదు’’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. 2005 సెప్టెంబరు 9 నుంచి హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి వచ్చింది. తమ తండ్రి ఆస్తిలో తమ అన్నదమ్ములతో సమాన వాటా కోరే అక్కచెల్లెళ్ళ వ్యాజ్యాలను పరిష్కరించేందుకు ఈ తేదీనే కొలబద్దగా  న్యాయస్థానాలు పరిగణిస్తున్నాయి. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న విచారణలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

జూనియర్ డాక్టర్ల అందోళన

Tags: The daughter is forever entitled to a share in the father’s property: Supreme Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *